మలయాళం స్టార్ హీరో జయసూర్య టైటిల్ రోల్‌లో నటిస్తున్న 'కథనార్, ది వైల్డ్ సోర్సెరర్' మూవీతో అనుష్క శెట్టి మలయాళంలో అరంగేట్రం చేయనుంది. 'హోమ్ ' ఫేమ్ రోజ
మలయాళం స్టార్ హీరో జయసూర్య టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘కథనార్, ది వైల్డ్ సోర్సెరర్’ మూవీతో అనుష్క శెట్టి మలయాళంలో అరంగేట్రం చేయనుంది. ‘హోమ్ ‘ ఫేమ్ రోజిన్ థామస్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, ఇది అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా రూపొందించబడింది.
శుక్రవారం, జయసూర్య తన 45వ పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా, మేకర్స్ రెండు నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు. అతీంద్రియ అంశాలతో కూడిన ఈ మూవీ ప్రపంచాన్ని కి థ్రిల్లింగ్ కు గురి చేశ్తుందని మేకర్స్ చెప్తున్నారు.
వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి కథనార్ చిత్రీకరణ జరుగుతోంది, భారతీయ సినిమాలో ఈ టెక్నాలజీని వినియోగించడం ఇదే మొదటి సారి అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం ప్రధాన భాగాలను 45,000 చదరపు అడుగుల మాడ్యులర్ షూటింగ్ ఫ్లోర్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు. మేకర్స్ దాదాపు 50% షూటింగ్ పూర్తి చేశారు.
ఆర్ రామానంద్ స్క్రిప్ట్ అందించిన కథనార్ మూవీకి సినిమాటోగ్రాఫర్ నీల్ డి కున్హా, యాక్షన్ కొరియోగ్రాఫర్ జంగ్‌జిన్ పార్క్ , కాగా సంగీత దర్శకుడు రాహుల్ సుబ్రహ్మణ్యన్ ఉన్ని. ఈ మూవీ 14 భాషల్లో విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్, జపనీస్, కొరియన్, ఇటాలియన్, ఇండోనేషియన్, రష్యన్, జర్మన్ భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన అనుష్క నటిస్తున్న తొలి ప్యాన్ వరల్డ్ సినిమా ఇదే కానుంది.
ఇదిలా ఉంటే, కొంత విరామం తర్వాత అనుష్క తన కమ్ బ్యాక్ చిత్రం మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఆమె త్వరలో కథనార్ సెట్స్‌లో జాయిన్ అవుతుందని భావిస్తున్నారు.