HomeTelanganaPolitics

తుమ్మలతో రేవంత్ భేటీ… త్వరలో కాంగ్రెస్ లోకి తుమ్మల?

తుమ్మలతో రేవంత్ భేటీ… త్వరలో కాంగ్రెస్ లోకి తుమ్మల?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భార రాష్ట్ర సమితిపై గుర్రుగా ఉన్నారు. బీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం టికెట్ తుమ్మలకు కా

మహిళా విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?
కేటీఆర్ కు తప్పిన ప్రమాదం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భార రాష్ట్ర సమితిపై గుర్రుగా ఉన్నారు. బీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం టికెట్ తుమ్మలకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఇవ్వడం పట్ల తుమ్మల ఆగ్రహంగా ఉన్నారు. ఆయనతో ఎంపీ నామా నాగేశ్వర్ రావు వంటి బీఆరెస్ ముఖ్యనేతలు సంప్ర‌దింపులు జరిపినప్పటికీ తుమ్మల వెనక్కి తగ్గడం లేదు.

రెండు రోజుల క్రితం తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్ నుంచి పాలేరుకు వందలాది కార్లతో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. తాను పాలేరులో పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. ఆయనను కాంగ్రెస్ లో చేరవలసిందిగా ఆయన అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో బీఆరెస్ దూరం జరిగిన ఆయన కాంగ్రెస్ పార్టీతో చర్చలు సాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు తుమ్మల నాగశ్వరరావును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తుమ్మలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తుమ్మల కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
అన్నీ అనుకూలిస్తే సెప్టెంబరు రెండో వారంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

మరో వైపు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ఈ మ్ధయ ఢిల్లీలో చర్చ‌లు జరిపారు. ఆమె కూడా కాంగ్రెస్ లోకి రావడం దాదాపు ఖరారయ్యింది. అయితే షర్మిల కూడా పాలేరు నుంచి తనకు టికెట్ ఇవ్వాలని9కాంగ్రెస్ అగ్రనేతల దగ్గర డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాక ఈ మధ్య బీఆరెస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ ముగ్గురు నేతలు పాలేరు టికెట్ కై పట్టుబడితే ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి.