అభివృద్ధిని చూసి తట్టుకోలేక బురద జల్లుతున్న కాంగ్రెస్ నాయకులు -సర్పంచ్ రమేష్ ◆రాజకీయ దురుద్దేశంతోనే నాపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రేగోడు మ
అభివృద్ధిని చూసి తట్టుకోలేక బురద జల్లుతున్న కాంగ్రెస్ నాయకులు -సర్పంచ్ రమేష్
◆రాజకీయ దురుద్దేశంతోనే నాపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
రేగోడు మండల పరిధిలోని ఆర్.ఇటిక్యాల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు లేనిపోని అవస్తవాలు మాట్లాడుతూ న్నారని ఆర్.ఇటిక్యాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచ్ సుంకే రమేష్ తెలిపారు.బుధవారం నాడు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ స్థానిక అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో ఆర్ ఇటిక్యాల గ్రామంను మునుపెన్నడూ లేనివిదంగా అభివృద్ధి బాటలో దుసుకపోతుంటే గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని వాపోయారు.గ్రామంలోని 204 సర్వే నం లో మొత్తం 3 ఎకరాలు స్థలం ఉన్నదని అందులోనే 1ఎకరం క్రీడా ప్రాంగణాన్ని కేటాహించడం జరిగిందన్నారు.మిగతా రెండు ఎకరాల స్థలములో ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు.ఎమ్మార్వో,ఆర్ ఐ సమక్షంలో రెండు ఎకరాల స్థలం లో ముగ్గు పోయడం జరిగిందని తెలిపారు.గతంలో క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలంను అదే సర్వే నంబర్ లోని కింద భాగం లో కేటాహించడం జరిగిందన్నారు.మిగతా రెండు ఎకరాల స్థలంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ముగ్గు వేశామని అన్నారు.వాటిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇళ్ల పట్టాలు పంచితే ఓట్లు రావనే దురుద్దేశంతో అడ్డు తగులుతున్నారని పేర్కొన్నారు.తన సొంత డబ్బులతో భూమిని జేసిబి తో లెవల్ చేయడం జరిగిందన్నారు.కొంతమంది కాంగ్రెస్ నాయకులు భూమిని కబ్జా చేస్తే మేమే ప్రజల కొరకు ఉపయోగొంలోకి తీసుకొచ్చామన్నారు.నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలి కానీ ఇలా అడ్డు తగలడం మంచి పద్ధతి కాదని అన్నారు.పత్రిక విలేకరులు కొందరు వాస్తవాలు తెలుసుకొని వార్తలు వ్రాయాలని అన్నారు.తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని అన్నారు.జర్నలిజం విలువలను కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఇటిక్యాల
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు పటేల్,బక్కప్ప,మాజీ పిఎసిఎస్ డైరెక్ట్ మలయ్య,అంజయ్య,సంగప్ప,మాజీ ఉపసర్పంచ్ హనుమయ్య,విద్య కమిటీ చైర్మన్ ఆంజనేయులు,బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సాయిబాబా,నాయకులు శ్రీశైలం,రాజు,నరసింలు,విట్టల్,రాజు నాయక్,విరయ్య సమావేశంలో పాల్గొన్నారు.