HomeTelanganaPolitics

తెల్లవారుజాము నుండే బీఎస్పీ నాయకుల అరెస్టులు…

తెల్లవారుజాము నుండే బీఎస్పీ నాయకుల అరెస్టులు…

•బిసి బిడ్డపై కేసుల పెట్టడాని తీవ్రంగా ఖండిస్తున్నాం •అక్రమ అరెస్టులు అప్రజా స్వామీ కం… •కోదాడ బీఎస్పీ ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్… కోదాడ

మేక దొంగతనం నెపంతో దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన నిందితుల అరెస్ట్
ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
కోరుట్ల దీప్తిని చంపింది స్వంత చెల్లెలే!

•బిసి బిడ్డపై కేసుల పెట్టడాని తీవ్రంగా ఖండిస్తున్నాం

•అక్రమ అరెస్టులు అప్రజా స్వామీ కం…

•కోదాడ బీఎస్పీ ఇన్చార్జి పిల్లుట్ల శ్రీనివాస్…

కోదాడ:ఎన్నికల సమీపిస్తున్న వేళ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడెక్కుతుంది..బుధవారం నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ను బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి నాన ఇబ్బందులకు గురిచేస్తుందని, దానికి నిరసనగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు మేరకు సూర్యపేటలో బుధవారం మహాధర్నాను ఏర్పాటు చేసినారు.ఈ ధర్నాకు బిఎస్పీ నాయకులు వెళ్లకుండా ఉదయం నాలుగు గంటలకు కోదాడ బిఎస్పి పార్టీ ఇంచార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ నివాసంలో ముందస్తు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మునగాల, చిలుకూరు, నడిగూడెం ,మోతే, అనంతగిరి మండలాలలో ఆ పార్టీ అధ్యక్షులతోపాటు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా పిల్లుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ … నిరసన తెలుపుకునే హక్కు కూడా ఈ ప్రభుత్వంలో లేకపోవడం శోచనియమన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం సరికాదని , అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.ఈ మహాధర్నా విజయవంతం అయితే బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని ఈ ధర్నాను చెడగొట్టాలనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆయన అన్నారు.అధికార పార్టీ ధర్నాలు చేస్తే తప్పులేదు కానీ మేము చేస్తే ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమని అన్నారు.