ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ వారసుడెవరు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మోడీ వారసుడని ఎ
ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ వారసుడెవరు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మోడీ వారసుడని ఎక్కువమంది బీజేపీ కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రజలు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారు.
ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పదవికి ఉత్తమంగా సరిపోతారు. సర్వే ప్రకారం, 29% మంది ప్రజలు ప్రధాని మోడీ వారసుడిగా అమిత్ షా సరిపోతారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
పోల్ లో పాల్గొన్నవారిలో 26% మంది యోగి ఆదిత్యనాథ్‌కు మద్దతు ఇవ్వగా, 15% మంది నితిన్ గడ్కరీకి అనుకూలంగా ఉన్నారు.
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 306 స్థానాలు, ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమికి 193 స్థానాలు లభించే అవకాశం ఉందని , 44 స్థానాలను ఇతరులు దక్కించుకుంటారని ఈ సర్వే అంచనా వేసింది.
ఈ సంస్థలు జనవరిలో నిర్వహించిన సర్వేతో పోల్చుకుంటే తాజా సర్వేలో ఎన్డీయే, ఇండియా కూటమిలు రెండూ మెరుగుపడ్డాయి. జనవరి సర్వేలో ఎన్డీయేకు 298 స్థానాలు లభించే అవకాశం ఉందని అంచనా వేయగా ఇప్పుడాసంఖ్య 306కు చేరింది.
ఇక జనవరి సర్వేలో ప్రతిపక్ష ఇండియా కూటమికి 153 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో ఈ కూటమికి 193 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.