HomeNationalEditor's Choice

ఆదిపురుష్ బడ్జెట్ కన్నా చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే

ఆదిపురుష్ బడ్జెట్ కన్నా చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే

ఆగస్టు 23న‌ చంద్రయాన్‌-3 చంద్రుడిపై ల్యాండ్‌ కావడం చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశం మొత్తం ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటున్న సమయంలో, ప్రభాస్ 'ఆదిప

‘ఇండియా’ కూటమికి మోడీ భయపడుతున్నాడా ?
Cricket: హ్యాట్రిక్ కొట్టిన‌ ఇండియా… పాక్ పై ఘన విజయం
బిజెపి విధానాలు దేశంలో హింస, హక్కుల దుర్వినియోగానికి దారితీశాయి -హ్యూమన్ రైట్స్ వాచ్

ఆగస్టు 23న‌ చంద్రయాన్‌-3 చంద్రుడిపై ల్యాండ్‌ కావడం చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశం మొత్తం ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటున్న సమయంలో, ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ తో సహా పలు భారీ బడ్జెట్ మూవీలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. పలువురు నెటిజనులు ఈ మూవీలకన్నా చంద్రయాన్ 3 బడ్జెట్ చాలా తక్కువని కామెంట్లు చేశ్తున్నారు.

ఆగస్టు 23న, చంద్రయాన్-3 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవం మీద దిగి భారతదేశం చరిత్ర సృష్టించింది. చాలా మంది నెటిజనులు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన‌ ‘ఆదిపురుష్’ బడ్జెట్ 700 కోట్ల రూపాయలు కాగా సూపర్ హిట్ అయిన చంద్రయాన్-3 బడ్జెట్ 615 కోట్లు మాత్రమే అని గుర్తు చేస్తున్నారు.

కొంత కాలం కిందట ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పుడు నెటిజనులు చేసిన ట్రోల్స్ కన్నా ఇప్పుడు చంద్రయాన్ తో పోలుస్తూ మరింతగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఒక ఆదిపురుష్ మూవీయే కాకుండా మరిన్ని మూవీల గురించి కూడా నెటిజనులు కామెంట్లు చేస్తున్నాఱూ. చంద్రయాన్-3 ఖర్చు ‘ఇంటర్స్టెల్లార్’ మువి బడ్జెట్ కంటే తక్కువగా ఉందని ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. భారతదేశం మూన్ మిషన్ బడ్జెట్ 615 కోట్ల రూపాయలు కాగా ‘ఇంటర్స్టెల్లార్’ మేక్స్ – మాథ్యూ మెక్‌కోనాఘే – ప్రాజెక్ట్ కోసం 1,200 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. దీనిపై ట్విట్టర్ యజమాని మాక్స్ స్పందిస్తూ, ఈ మిషన్ “భారతదేశానికి మంచిది” అని అన్నారు. ‘ఇంటర్స్టెల్లార్’ మూవీ భూమి మీద ఉన్న ప్రజలను వేరే గ్రహాలకు తీసుకెళ్ళడానికి సంబంధించినదే కావడం విశేషం.