HomeCinema

పిల్లలు పుట్టాలంటే గర్భం వస్తే సరిపోతుంది, పెళ్ళెందుకంటున్న అనుష్క శెట్టి

పిల్లలు పుట్టాలంటే గర్భం వస్తే సరిపోతుంది, పెళ్ళెందుకంటున్న అనుష్క శెట్టి

మేకర్స్ ప్రకటించినట్లుగా, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ఇందులో స్టార్ నటి అనుష్క శెట్టి, నటుడు

‘గుంటూరు కారం’ పై ‘బుక్ మై షో’లో 70 వేల నెగెటివ్ ఓట్లు
10 సెకన్లు లైంగిక వేధింపులకు పాల్పడితే నేరం కాదట… తీర్పిచ్చిన కోర్టు
సినీ నటి జయప్రద కు 6 నెలల జైలు శిక్ష‌

మేకర్స్ ప్రకటించినట్లుగా, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ఇందులో స్టార్ నటి అనుష్క శెట్టి, నటుడు నవీన్ పోలిశెట్టి జంటగా నటించారు.
మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన, ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ట్రైలర్‌లో, నవీన్ పోలిశెట్టి సిద్ధూ అనే స్టాండ్-అప్ కమెడియన్ పాత్రను పోషిస్తుండగా, అనుష్క శెట్టి నైపుణ్యం కలిగిన మాస్టర్ చెఫ్‌గా అన్వితగా మెరిసింది.

అనివితకు ప్రేమ , పెళ్ళి మీద ఎలాంటి నమ్మకం ఉండదు. తనకెలాంటి ఫీలింగ్స్ లేవని ఆమె ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఈ క్రమంలో సిద్ధూకు అన్విత అసాధారణ ప్రతిపాదన చేస్తుంది. వివాహం లేకుండానే సిద్దూతో పిల్లలను కనాలని ఉందని చెప్తుంది.
ఈ మాట విన్న సిద్దూ షాక్ కు గురవుతాడు. ఆ తర్వాత ఏమవుతుంది అనేడి తెరపై చూడాల్సిందే.
చాలా విరామం తర్వాత అనుష్క శెట్టి తిరిగి రావడం, నవీన్ పోలిశెట్టి అద్భుతమైన‌ హాస్యతో కూడిన నటన, అనుష్క అందం, నిర్భయమైన ప్రవర్తన, ఆకట్టుకునే సంగీతం తో ట్రైలర్ ఆకర్షణగా తయారు చేశారు.

UV ప్రొడక్షన్స్ వెంచర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మురళీ శర్మ, తులసి, జయసుధ, భద్రమ్, నాజర్, అభినవ్ గోమతం ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాధన్ మధురమైన బాణీలను అందించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెప్టెంబర్ 7, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.