HomeTelangana

కాంగ్రెస్ లో మళ్ళీ రచ్చ… నాగం Vs జూపల్లి

కాంగ్రెస్ లో మళ్ళీ రచ్చ… నాగం Vs జూపల్లి

అధిష్టానం అందరిని ఒక వేదిక మీద కూర్చో బెట్టి ఒకరి చేతుల్లో మరొకరి చేతులు వేయించి తమ పార్టీలో విబేధాలు లేవు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినా కాంగ్ర

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ల యుద్దం
BJP అబద్దాలు నార్త్ లో నమ్ముతారేమో కాని తెలంగాణలో నమ్మరన్న జిట్టా బాలకృష్ణారెడ్డి… పార్టీ నుంచి సస్పెండ్ చేసిన‌ బీజేపీ
ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం

అధిష్టానం అందరిని ఒక వేదిక మీద కూర్చో బెట్టి ఒకరి చేతుల్లో మరొకరి చేతులు వేయించి తమ పార్టీలో విబేధాలు లేవు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేకుండా ఒక్క రోజు కూడా గడవదు. నాయకుల మధ్య, గొడవలు, విమర్శలు, ఒకరిపై ఒకరి ఎత్తులు, పై ఎత్తులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టీ కాదేమో అని ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంటుంది.

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో తమ గెలుపు కూడా ఖాయమనే ధీమా ఏర్పడింది. మరో వైపి అధ్గిష్టానం కూడా నేతల మధ్య విబాధాలను పరిష్కరించి అందరినీ ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నది. దాంతో ఉప్పు నిప్పుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కలిసిపోయినట్టు కనిపిస్తున్నారు. మిగతా నాయకుల మధ్య కూడా విబాధాలు సమిసిపోయినట్టు కనిపించింది. అయితే హటాత్తుగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి.. జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కె. దామోదర్‌రెడ్డిలపై విమర్శలు గుప్పించడంతో ఆ పార్టీలో సమస్య మళ్ళీ మొదటికొచ్చిందనే చర్చ నడుస్తోంది.

మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాగం , కొల్లాపూర్ తో సహా మరో మూడు నియోజకవర్గాలకు టిక్కెట్లు ఇవ్వాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ సభ్యుడు, కొల్లాపూర్‌ టికెట్‌ ఆశించిన చింతల్లపల్లి జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్నారని, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు జగదీశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని నాగం అన్నారు. కృష్ణారావు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని, చేరగానే కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు జనార్దన్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

కొల్లాపూర్‌తో సంతృప్తి చెందకుండా జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్, గద్వాల్, వనపర్తి టిక్కెట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. తన చుట్టూ చాలా హైప్ క్రియేట్ చేస్తూ ఎన్నికల్లో ఒంటరిగా అయినా గెలుస్తానని చెప్పున్నాడు.” అని జనార్దన్ రెడ్డి అన్నారు.

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. “గతసారి ఆయన గెలుపు కోసం వ్యక్తిగతంగా కృషి చేశాను, ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఈ నాయకులు పార్టీకి విధేయులుగా ఉంటారా, ఎన్నికల తర్వాత ఇతర పార్టీలకు విధేయత చూపబోమని ఎవరు హామీ ఇస్తారనేది ప్రశ్న. అని జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.