HomeNationalCrime

ఓరి దుర్మార్గుడా …! పోలీసు ఛలానా తప్పించుకోవడం కోసం గాళ్ ఫ్రెండ్ ను కిందికి తోసేశాడు

ఓరి దుర్మార్గుడా …! పోలీసు ఛలానా తప్పించుకోవడం కోసం గాళ్ ఫ్రెండ్ ను కిందికి తోసేశాడు

ఓ యువకుడు హెల్మెట్ లేకుండా, విపరీతమైన స్పీడ్ తో తన ప్రియురాలిని బైక్ ఎక్కించుకొని జాం.. జాం.. అ‍ంటూ రోడ్డుపై దూసుకపోతున్నాడు. ఇంత లో ఓ చౌరస్తాలో రెడ్

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
స్కూల్ నే బార్ కమ్ లాడ్జిగా మార్చేసిన‌ టీచర్!
పోలీసులు నేరాలను అరికట్టడానికి పంచాంగాన్ని ఫాలో కావాలని డీజీపీ ఆదేశం

ఓ యువకుడు హెల్మెట్ లేకుండా, విపరీతమైన స్పీడ్ తో తన ప్రియురాలిని బైక్ ఎక్కించుకొని జాం.. జాం.. అ‍ంటూ రోడ్డుపై దూసుకపోతున్నాడు. ఇంత లో ఓ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడింది. అతను బైక్ ఆపుదామనుకొని స్లోప్ చేశాడు. ఇంతలో అతని వైపు ట్రాఫిక్ పోలీసు రావడం కనిపించింది. అంతే…ఆ యువకుడు ముందూ వెనకా ఆలోచించకుండా ఒక్క సారి బైక్ స్పీడ్ ను పెంచేశాడు. దాంతో వెనక కూర్చున్న ప్రియురాలు కిందపడిపోయింది. అది చూసి కూడా ఆ యువకుడు బైక్ పై పారిపోయాడు.
కిందపడి గాయాలపాలైన ఆ యువతిని ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి లేపి ఆస్పత్రికి తీసుకెళ్ళాడు.

పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అభిషేక్ ఆనంద్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. నెటిజనులు ఆ యువకుడిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఆ వీడియోను పోస్ట్ చేసిన అభిషేక్, “ఆ అమ్మాయి ఆ యువకుడికి బ్రేకప్ చెప్ప‌డానికి ఆలస్యం చేయకూడదు. చాలా మంది వస్తారు వెళతారు. ఈ అబ్బాయికి తన ప్రియురాలి కన్నా ఛలాన్ తప్పించుకోవడమే ముఖ్యమైపోయింది. అందుకే ఆమెను బైక్‌పై నుండి రోడ్డు మీదికి తోసేశాడు.” అని కామెంట్ చేశారు

ఈ వీడియో ఆగస్ట్ 14న పోస్ట్ చేయబడింది మరియు ట్విటర్‌లో 1,741 వీక్షణలు వచ్చాయి.