తానుముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని, అయితే దానికన్నా జగన్ ఓడిపోవడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు జనసే
తానుముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని, అయితే దానికన్నా జగన్ ఓడిపోవడమే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు జనసేనకు పూర్తి మెజార్టీ ఇస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని, ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా మంచిదే కానీ జగన్ మాత్రం ఓడిపోవాలని ఆయన స్పష్టం చేశారు.
విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఒక ఆశయంతో గాజువాకలో పోటీ చేశానని, అయితే దోపిడీ చేస్తాడు అని తెలిసి కూడా ఈ నియోజకవర్గం జగన్ కు గెలుపును ఇచ్చి, తనకు ఓటమిని ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
”అదే గాజువాక ప్రజలు నాకు ఈ రోజు అఖండ అస్వాగతం పలికారు. నేను ఇక్కడ ఓడిపోయిన విషయం తెలియనంత గొప్ప స్వాగతం లభించింది. ఇంతటి ప్రేమను తాను ఊహించలేదు. విశాఖలో భవన నిర్మాణ కార్మికుల సభ అంటే ఎక్కువమంది రాకపోవచ్చని భయపడ్డాను. కానీ ఈ సభకు 2 లక్షలకు పైగా జనం వచ్చి, ఆశయంతో ఉన్న వాడికి గెలుపోటములు అతీతం అని నిరూపించేలా నిలబడ్డారు. 2024లో గాజువాకలో గెలిచేది జనసేన పార్టీయే” అని పవన్ కల్యాణ్ అన్నారు.
మొత్తానికి ఈ సభ ద్వారా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి జగన్ పై పోరాడుతామని పవన్ చెప్పకనే చెప్పారు. పైగా పొత్తులో జనసేనకు ఎక్కువ సీట్లు రావని, ఇతరులు ముఖ్యమంత్రి కావచ్చని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి పవన్ మాట్లాడారనే చర్చ నడుస్తోంది.