HomeTelanganaPolitics

కాంగ్రెస్ లో భగ్గుమన్న విబేదాలు…ఈసారి అజారుద్దీన్ వర్సెస్ విష్ణు వర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గమే వేదిక‌

కాంగ్రెస్ లో భగ్గుమన్న విబేదాలు…ఈసారి అజారుద్దీన్ వర్సెస్ విష్ణు వర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గమే వేదిక‌

ప్రముఖ కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, ఒకప్ప్టి క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మధ్య వార్ జోరందుక

బీఆరెస్ కన్నా ముందంజలో కాంగ్రెస్…. ‘సౌత్ ఫస్ట్ న్యూస్’ ప్రీ పోల్ సర్వే వెల్లడి
జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?

ప్రముఖ కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, ఒకప్ప్టి క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మధ్య వార్ జోరందుకుంది. ఇద్దరూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటుండడంతో కార్యకర్తలు కూడా రెండుగా చీలిపోయారు.

విష్ణు వర్ధన్ రెడ్డిని పట్టించుకోకుండా అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో సభ ఏర్పాటు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అజారుద్దీన్ ఏర్పాటుచేసిన‌ సభను విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తమ నియోజకవర్గంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సభను ఎలా నిర్వహిస్తారంటూ విష్ణు అనుచరులు రచ్చ చేశారు. విష్ణు అనుచరులను అజార్ అనుచరులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం కాస్తా తోపులాటగా , ఘర్షణగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

కాగా, ఈ రెండు వర్గాల మధ్య కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం కల్పించుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. నాయకులు కుమ్ములాడుకుంటున్నా అధినాయకత్వం చోద్యం చూసే కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగానే ఈ గొడవ మరింత ముదిరే దాకా చూడటం, అనంతరం ఎవరినీ ఒకరిని పార్టీ నుంచి వెళ్ళగొట్టడం అనంతరం ఆ స్థానంలో ఓడిపోవడం కాంగ్రెస్ కు అలవాటే కదా !