రాహుల్ గాంధీ పై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన మళ్ళీ ఎంపీగా ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టబోతున్నారు. రా
రాహుల్ గాంధీ పై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన మళ్ళీ ఎంపీగా ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టబోతున్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నుండి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇండియా కూటమి నేతలు మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు.
“ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమ విజయం” అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఇది న్యాయానికి, మన ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం అని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు.
” రాహుల్‌గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణకు సంబంధించి అధికారిక ప్రకటనను స్వాగతించండి. అతను ఇప్పుడు భారత ప్రజలకు, వాయనాడ్‌లోని తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి లోక్‌సభలో తన విధులను తిరిగి ప్రారంభించవచ్చు. ఇది న్యాయానికి, మన ప్రజాస్వామ్యానికి విజయం!” అంటూ శశిథరూర్ ట్వీట్ చేశాడు.
#WATCH | I.N.D.I.A alliance leaders celebrate following restoration of Lok Sabha membership of Congress leader Rahul Gandhi.
— ANI (@ANI) August 7, 2023
(Source: AICC) pic.twitter.com/vaVwBcreYM