తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరికొచ్చింది. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. అధికార బీఆరెస్ ఈ నెలలో దాదాపు 70 మంది అభ్యర్థు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరికొచ్చింది. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. అధికార బీఆరెస్ ఈ నెలలో దాదాపు 70 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించనున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీకూడా రంగం సిద్దం చేసుకుంటోంది.
ఈ మేరకు ఆ పార్టీ కోసం పని చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన AICC ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ కు అంద జేశారు. కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న ప్రకారం సునీల్ టీం మొత్త నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. అందులో తప్పకుండా గెలిచే స్థానాలు, కొద్దిగా కష్టపడితే గెలిచే స్థానాలు, గెలవడం చాలా కష్టమైన స్థానాలు.
అందులో గెలిచే కేటగిరీలో 41 స్థానాలు
కష్టపడితే గెలిచే కేటగిరీలో 42 స్థానాలు
కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్న కేటగిరీలో 36 స్థానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యం మొదటి కేటగిరీలో ఉన్న 41 స్థానాల అభ్యర్థులతో తొలి లిస్ట్ ప్రకటించాలని పీసీసీ ప్లాన్ చేస్తున్నది.
మరో వైపు ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గాంధీ భ్యవన్ లో తెలంగాణ నాయకులపై మండిపడ్డట్టు తెలిసింది. ఎన్నికలు అతి త్వరలో ఉన్న నేపథ్యంలో , ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు కొట్లాటల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ”అందరూ ఐక్యంగా ఉంటేనే గెలుస్తాం. రేపు అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి వచ్చి మేమేమీ మంత్రులము కాము కదా ! మీరే కదా పదవులు పొందేది.” అని క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.