HomeTelangana

రాజ్ భవన్ ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా… ‘ కార్మికులారా ! నేను మీ వైపే’ అని గవర్న‌ర్ ట్వీట్

రాజ్ భవన్ ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా… ‘ కార్మికులారా ! నేను మీ వైపే’ అని గవర్న‌ర్ ట్వీట్

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళి సై పెండింగ్ లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కా

అనుచరుడి హత్యతో భగ్గుమన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి….ఇది బీఆరెస్ పనే అని ఆరోపణ‌
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరుద్యోగుల ధర్నా
ధర్మపురి అరవింద్ కు కార్యకర్తల షాక్.. రాష్ట్ర BJP ఆఫీస్ లో రచ్చ రచ్చ‌

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళి సై పెండింగ్ లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన ప్రదర్శనలకు దిగిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బస్సులు ఆపేసి కార్మికులు ధర్నాకు దిగారు. అనంతరం కార్మికులు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ పిలుపుమేరకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుకు భారీగా చేరుకున్నారు. నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ర్యాలీగా గవర్నర్‌ అధికార నివాసానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌ గేటు ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నారు. గవర్నర్‌ తమిళిసైకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో0 గవర్నర్ తమిళి సై స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. తానెప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షమే ఉంటానని ఆమె అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు తాను వారికి మద్దతుగా నిలబడ్డానని ఆమె గుర్తు చేశారు. కార్మికుల హక్కులు కాపాడటం కోసమే తాను ఆ బిల్లును శ్రద్దగా పరిశీలుస్తున్నట్టు తమిళసై తెలిపారు.

”ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని తెలిసి బాధపడ్డాను.. మొన్నటి సమ్మెలో కూడా నేను వారి వెంటే ఉన్నాను.. ఇప్పుడు కూడా కార్మికుల హక్కులను కాపాడాలనే బిల్లును శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నాను.” అని గవర్నర్ ట్వీట్ లో పేర్కొన్నారు.