పవన్ కళ్యాణ్, ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ''బ్రో' మూవీలో పృథ్వి నటించిన శ్యాంబాబు చేసిన డ్యాన్స్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడుతున్న విషయ
పవన్ కళ్యాణ్, ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ”బ్రో’ మూవీలో పృథ్వి నటించిన శ్యాంబాబు చేసిన డ్యాన్స్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాను సంక్రాంతి సందర్భంగా చేసిన ఆనందంతో చేసిన నృత్యంపై సెటైర్ గా ‘బ్రో’ మూవీలో పృథ్వి తో నృత్యం చేయించారని ఆయన ఆరోపించారు. తనను అవమానించడానికే శ్యాం బాబు క్యారెక్టర్ పెట్టారని, సినిమాలో అవసరం లేనివి ఇరికించడం వల్లనే ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యిందని రాంబాబు అన్నారు. తాను కూడా త్వరలో ఓ మూవీ తీస్తానని ఆయన ప్రకటించారు. ‘నిత్య పెళ్ళి కొడుకు’, ‘పెళ్ళిల్లు పెటాకులు,’ ‘తాళి ఎగతాళి’, అనే పేర్లు పరిశీలిస్తామని రాంబాబు అన్నారు.
రెండు మూడు రోజులుగా అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ పై, ‘బ్రో’ మూవీపై చేస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో బ్రో మూవీ నిర్మాత విశ్వప్రసాద్ ఓ తెలుగు ఛానల్ తో మాట్లాడుతూ, తమ మూవీలో శ్యాం ప్రసాద్ డ్యాన్స్ కు , రాంబాబు డ్యాన్స్ కు అసలు సంబంధం లేదన్నారు. రాంబాబు, శ్యాంబాబుల డ్రస్సులు మాత్రమే మ్యాచ్ అయ్యాయని అందులో మరేమీ మ్యాచ్ కాలేదని ఆయన అన్నారు. రాంబాబు అనవసరం గా ఏదేదో ఊహించుకుంటున్నారని, రాజకీయ అవసరాల కోసం ఆయన దీనిని ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు.
ఇది రాజకీయ సినిమా కాదని, తాము మూవీలను బిజినెస్ కోసం తీస్తాము కానీ రాజకీయ నాయకులపై విమర్శలు చేయమని విశ్వప్రసాద్ చెప్పారు.