తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రజా రవాణా ను పతిష్టపరిచేందుకు టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినె
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రజా రవాణా ను పతిష్టపరిచేందుకు టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ అంశంపై ఆగస్టు 3న జరిగే శాసన సభావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారు.
దీంతో 43వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది.
ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశపు వివరాలను ఇతర మంత్రులతో కలిసి మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు.
వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించామని, తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
హైదరాబాద్ కీలక రూట్లలో మెట్రో విస్తరించాలని, మూడు నాలుగేళ్లలో పూర్తిచేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలు లో తిరిగి తీర్మానం చేసి గవర్నర్ కు పంపుతామని, రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదని కేటీఆర్ అన్నారు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల ను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టు కు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉందని, హాకింపేట ఎయిర్పోర్ట్ ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇవే కాక రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధి పై క్యాబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు.
కేంద్రం వరద రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్,అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టాలకు సంబందించి నివేదిక ఇవ్వాలని కోరారు.