HomePoliticsNational

మణిపూర్ హింస: పోలీసులు, ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

మణిపూర్ హింస: పోలీసులు, ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

మణిపూర్ లో ఓ సాయుధ గుంపు ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన సంఘటనపై భారత అత్యున్నత న్యాయస్థానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు

రాహుల్ గాంధీ యాత్ర కోసం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి
అట్లుంటది మనతోని..టీవీ రిపోర్టర్లా మజాకా ?
ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు

మణిపూర్ లో ఓ సాయుధ గుంపు ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన సంఘటనపై భారత అత్యున్నత న్యాయస్థానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మే 4న ఘటన జరిగితే మే 18 దాకా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులకు 14 రోజులు ఎందుకు పట్టిందని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ”మే 4న ఘటన జరిగితే మే 18న ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? మహిళలను నగ్నంగా ఊరేగించి, కనీసం ఇద్దరిపై అత్యాచారం చేసిన ఘటన జరిగితే . పోలీసులు ఏం చేస్తున్నారు?” అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు బాధితులకు ఎలాంటి న్యాయ సహాయం అందిస్తున్నారో మాకు తెలియజేయండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

“పోలీసులు ఏం చేశారు? వీడియో బహిఱ్గతమైన ఆ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను జూన్ 24న అంటే నెల మూడు రోజుల తర్వాత మెజిస్టీరియల్ కోర్టుకు ఎందుకు బదిలీ చేశారు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

అయితే, ప్రభుత్వం ఏమీ దాచడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. “అక్కడి పరిస్థితిని ఈ కోర్టు పర్యవేక్షించవచ్చు. ”అని అన్నారాయన.

“ఇది చాలా దుర్మార్గమైనది ఈ మహిళలను పోలీసులే సాయుధ‌ గుంపుకు అప్పగించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కేసు విచారణను పోలీసులు నిర్వహించాలని కూడా మేము కోరుకోవడం లేదు, ”అని ధర్మాసనం పేర్కొంది.

సుప్రీం కోర్టు ప్రశ్నలకు జవాబివ్వడానికి సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీం ను కోరగా, ఇప్పటికే సమయం చాలా గడిచిపోయింది. తమ ప్రియమైన వారితో సహా ప్రతిదీ కోల్పోయిన వారికి, ఆ రాష్ట్రానికి చికిత్స చేయాచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది.

జాతి హింసతో నలిగిపోతున్న రాష్ట్రంలో నమోదైన ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ల సంఖ్య, ఇప్పటి వరకు చేసిన అరెస్టుల వివరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది.

అంతకుముందు రోజు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, హింసాత్మక కేసులలో దర్యాప్తును పర్యవేక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించినట్లయితే యూనియన్ ఆఫ్ ఇండియాకు అభ్యంతరం లేదని ధర్మాసనానికి తెలిపారు.

మహిళలపై హింసను ఎదుర్కోవడానికి విస్తృత యంత్రాంగాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కోరింది. మే నుండి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలపై ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ప్రశ్నించింది.
మే 4న వీడియోలో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల తరఫున‌ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

వీడియోను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, తక్షణ నివారణ, పునరావాస చర్యలను ప్రారంభించి, తీసుకున్న చర్యలను తమకు తెలియజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు టీం ను ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఆ కమిటీలో పలువురు మహిళా జడ్జిలతో పాటు, నిపుణులను కూడా భాగస్వాములను చేస్తామని తెలిపిన సుప్రీం కోర్టు కేసును మంగళవారానికి వాయిదా వేసింది.