ఒక వైపు మనం రాకెట్లను చంద్రమండలానికి పంపిస్తుంటాం…… మరో వైపు ఆ పక్కనే క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో మనుషులను చంపుతూ ఉంటాం….. ఈ దేశ ప్రధానిగా, రా
ఒక వైపు మనం రాకెట్లను చంద్రమండలానికి పంపిస్తుంటాం…… మరో వైపు ఆ పక్కనే క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో మనుషులను చంపుతూ ఉంటాం….. ఈ దేశ ప్రధానిగా, రాష్ట్రపతులుగా మహిళలు పాలుస్తారు…. అప్‍అశకునాల పేరుతో మహిళలను అనేక రకాల వివక్షలకు గురి చేస్తూ ఉంటాం…
బస్సులో మొదటి ప్యాసెంజర్ గా మహిళను ఎక్కనివ్వని రాష్ట్రం మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? బస్సులో మొదట మహిళ ఎక్కితే ఆ బస్సు ప్రమాదానికి గురవుతుందట, లేదంటే బిజినెస్ కాదట, లేదంటే ఇంకేమైనా అవాంతరాలు వస్తాయట. అందుకే అక్కడ బస్సులో మొదట మహిళను ఎక్కనివ్వరు.
ఒడిశాలో అనేక చోట్ల ప్రైవేట్ బస్సుల్లో మొదటి ప్యాసెంజర్ గా మహిళను ఎక్కనివ్వరు. ఎవరైనా మగవాళ్ళు బస్సు ఎక్కిందాకా వేచి ఉండి ఆ తర్వాత మహిళలు బస్సు ఎక్కాలి.
సోనేపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ లో వేసిన పిటిషన్ తో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.
భువనేశ్వర్‌లోని బారాముండా బస్టాండ్‌లో మొదటి ప్రయాణికురాలిగా ఒక మహిళను బస్సు ఎక్కకుండా ఆపడంతో కమిషన్ జోక్యాన్ని కోరుతూ సోనేపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు.
బస్సులో ప్రయాణికులు లేనందున బస్సు కండక్టర్ మహిళను బస్సు ఎక్కేందుకు అనుమతించలేదని, బస్సులో మొదటగా మహిళను ఎక్కేందుకు అనుమతించడం చెడ్డ శకునంగా పరిగణిస్తున్నట్లు పాండా తెలిపారు. మొదటి ప్రయాణికురాలిగా అనుమతిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కండక్టర్ ఆ మహిళకు చెప్పినట్లు సమాచారం.
జూలై 25న రవాణా శాఖకు ఈ పిటిషన్‌ను పంపిన కమిషన్, ఈ విధమైన చర్యల గురించి కమిషన్‌కు పిర్యాదులు అందడం ఇదే మొదటిసారి కాదని పేర్కొంది. ఇకపై ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కమిషన్ రవాణా శాఖను ఆదేశించింది.
‘‘ఈ తరహా ఘటన గతంలో కూడా కమిషన్‌కు తెలిసింది. కావున మహిళా ప్రయాణీకులకు భవిష్యత్తులో అసౌకర్యం కలగకుండా, వారి భద్రత , గౌరవాన్ని కాపాడేందుకు, బస్సులు (ప్రభుత్వం, ప్రైవేట్ రెండూ) మొదటి ప్రయాణీకురాలిగా మహిళలను అనుమతించేలా చూడాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని మహిళా కమిషన్ OSCW తన ఆదేశాలలో పేర్కొంది.
అలాగే మహిళలకు కేటాయించిన బస్సు సీట్ల శాతాన్ని 50 శాతానికి పెంచాలని రవాణా శాఖను OSCW కమిషన్ కోరింది.