స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మనిషి జీవితంలో ఓ భాగమయిపోయింది. దానిని కొందరు అవసరాలకు వినియోగించుకుంటే మరి కొందరూ దానికి భానిసలై పోయి జీవితాలను ఛిన్నాభిన్నం
స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మనిషి జీవితంలో ఓ భాగమయిపోయింది. దానిని కొందరు అవసరాలకు వినియోగించుకుంటే మరి కొందరూ దానికి భానిసలై పోయి జీవితాలను ఛిన్నాభిన్నం, చేసుకుంటున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ మధ్య నెటిజనులకు రీల్స్ మోజు పెరిగిపోయింది. రీల్స్ చేసేందుకు కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. మరి కొందరు నేరాలబాటపడుతున్నారు.
జయదేవ్ ఘోష్,సతి అనే దంపతులు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఉంటారు. వారికి ఏడేళ్ళ కుమార్తె , ఎనిమిది నెలల కుమారుడు ఉన్నారు. వారిది పేద కుటుంబం. అయితే ఆ దంపతులిద్దరికీ ఇన్స్టా గ్రాం లో రీల్స్ చేయాలనే కోరిక బలంగా ఉంది. అందుకోసం మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ అంత డబ్బు వారిదగ్గర లేదు. అయినప్పటికీ ఎలాగైనా ఐ ఫోన్ 14 కొనుక్కోవాలని అనుకున్నారు ఆ దంపతులు. అందుకు డబ్బుల కోసం ఎనిమిది నెలల తమ కన్న కొడుకును మరో జంటకు అమ్మేశారు.
ఆ తర్వాత ఆ జంట రీల్స్ చేసుకుంటూ పలు ప్రాంతాలను తిరిగారు. అనంతరం వారు ఇంటికి వచ్చేశారు. అయితే ఎనిమిది నెలల కుమారుడు కనిపించకపోవడం, పేదవారైన వాళ్ళ దగ్గర లక్ష రూపాయలకు పైన విలువగల సెల్ ఫోన్ ఉండటం చుట్టుపక్కల వారికి అనుమానాలు రేకిత్తించింది. దాంతో వారు భార్యాభర్తలను గట్టిగా నిలదీయగా, డబ్బు కోసం కుమారుడిని విక్రయించినట్టు వారు అంగీకరించారు. వెంటనే స్థానిక కౌన్సిలర్ తారక్ గుహ పోలీసులకు సమాచారమిచ్చాడు.
పోలీసులు వస్తున్న విషయం అర్దమైన జయదేవ్ ఘోష్ పరారవగా ఆయన భార్య సతిని పోలీసులు అరెస్టు చేశారు.
బిడ్డను కొనుగోలు చేసిన దంపతులపై మరియు ఒక మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును కొనుగోలు చేసిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పాపను కొనుగోలు చేసిన దంపతులు, తల్లి ఇప్పుడు మానవ అక్రమ రవాణా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. జయదేవ్ ఘోష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, వారి ఎనిమిది నెలల పసిబిడ్డకంటే ముందు తండ్రి తన ఏడేళ్ల కుమార్తెను కూడా విక్రయించడానికి ప్రయత్నించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.