"ఈ వీడియో 19 జూలై న లీక్ అయింది. మీరు గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వందలాది కేసులు జరుగుతున్నాయి. అందుకే రాష్ట్రంలో ఇంటర్నెట్ నిషేధించబ
“ఈ వీడియో 19 జూలై న లీక్ అయింది. మీరు గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వందలాది కేసులు జరుగుతున్నాయి. అందుకే రాష్ట్రంలో ఇంటర్నెట్ నిషేధించబడింది.” -ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ సీఎం
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇటీవల జాతీయ టెలివిజన్‌లో ముగ్గురు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి, మే 4 న మైతేయ్ గుంపు లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన ఒంటరిది కాదని ఇటువంటివి వందలాది కేసులు జరిగాయని స్వయంగా అంగీకరించారు.
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారాల గురించి ఆయన చేసిన ప్రకటన, అతని పాలన పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతాయి. ఒక్క మణిపూర్ ప్రభుత్వంపైనే కాదు, వారికి మద్దతుగా నిలబడ్డ మోడీ ప్రభుత్వం పై కూడా ప్రశ్నలు వస్తాయి.
తమపై జరుగుతున్న అత్యాచారాల గురించి మణిపురి మహిళలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఎవరూ వారి మాటలు పట్టించుకోవడం లేదు?
అనేక మణిపురి విద్యార్థి సంస్థలు, పాత్రికేయులు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల సంఘటనలను డాక్యుమెంట్ చేస్తున్నారు.
ముగ్గురు మహిళల నగ్న ఊరేగింపు, అత్యాచారం , హత్యల గురించి 900-1,000 మంది గుర్తు తెలియని దుండగులపై మే 18న జీరో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయబడింది. కానీ ఒక నెల తర్వాత, జూన్ 21 న, FIR సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయబడింది. వీడియో లీక్ అయ్యాక మాత్రమే చర్యలు మొదలు పెట్టారు పోలీసులు. పోలీసులకు, ప్రభుత్వానికి ముందుగానే తెలిసి ఉంటే ఎందుకు ఏ చర్యలూ చేపట్ట లేదు? వీడియో లీక్ అయిన తర్వాతనే తెలిసినట్టు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి , దేశ హోంమంత్రులు ఎందుకు మాట్లాడారు ?
ఇంత క్రూరమైన ఈ సంఘటనను 75 రోజులకు పైగా పాతిపెట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించినట్లు ‘వందల కొద్దీ అత్యాచారాలు’ జరిగితే, మణిపూర్‌లోని పోలీస్ స్టేషన్‌లలో ఇలాంటి ఎఫ్‌ఐఆర్‌లు ఎన్ని దుమ్ము పట్టి ఉన్నాయి?
ఆ బాధితులకు న్యాయం జరుగుతుందా? ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ వారికి, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వగలరా ?
“మీ పురుషులు మా మహిళలపై అదే విధంగా చేసారు కాబట్టి మీపై మేము అదే విధంగా చేస్తాం అని మైటీ వర్గం పురుషులు చెప్పి మరీ తనపై అత్యాచారం చేశారని చురచంద్‌పూర్‌కు చెందిన ఒక కుకీ మహిళ స్వయంగా మీడియాతో చెప్పారు.
ముగ్గురు కుకీ మహిళలపై దాడి చేసిన గుంపు ఇదే విధమైన వాదన చేసింది.
“లామ్కా ప్రాంతంలో, మీ ప్రజలు మా స్త్రీలపై అత్యాచారం చేసారు, కాబట్టి మేము మీకు కూడా మీపై అదే చేయబోతున్నాం” అని దాడిని చూసిన ఒక మహిళకు మైతేయ్ గుంపు తెలిపింది.
ఫేక్ న్యూస్, పుకార్లు పుట్టించడం , వినడం ద్వారా ప్రేరేపించబడిన ‘రివెంజ్ రేప్‌లు’ మహిళలపై క్రూరమైన నేరాన్ని సమర్థించుకోవడానికి పురుషులు ఉపయోగించుకుంటున్నారు.
ఈ సంఘర్షణలో మహిళలే సమిధలవుతున్నారు. మహిళలకు ప్రాథమిక హక్కులు లేవా ?
జూలై 20న, వైరల్ వీడియో వెలువడిన ఒక రోజు తర్వాత, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ట్విట్టర్‌లో ఇలా అన్నారు:
“వీడియో బయటపడిన వెంటనే ఈ సంఘటనపై సుమోటోగా మణిపూర్ పోలీసులు ఈ ఉదయం చర్యకు దిగారు. ఈ ఉదయం మొదటి అరెస్టు చేశారు. ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతోంది మరియు ఉరిశిక్ష విధించే అవకాశంతో సహా దోషులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేము హామీ ఇస్తున్నాము. ” అని అన్నారు.
ఇక్కడ అద్భుతమైనది ఏమిటంటే ‘సుమోటో’ అనే పదం, దీని అర్థం పోలీసులు ఏదైనా నేరాన్ని విచారించడానికి అధికారిక ఫిర్యాదు కోసం వేచి ఉండకూడదు. వారే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి. కాని ఈ సంఘటనలో రెండు నెలల ముందే పిర్యాదు కూడా అందింది. అంటే ఫిర్యాదుకు అర్థం లేదా? సంఘటన జరిగిన రోజే పోలీసులకు తెలిసి ఉంటే, ప్రభుత్వానికి తెలిసి ఉంటే ఎందుకు ఏ చర్యలు చేపట్టలేదు?
“ముఖ్యమంత్రులందరూ తమ రాష్ట్రాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణుల రక్షణ కోసం, రాజస్థాన్, లేదా ఛత్తీస్‌గఢ్, లేదా మణిపూర్‌లో ఎక్కడ సంఘటన జరిగినా వారు కఠిన చర్యలు తీసుకోవాలి.”అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ 78 రోజుల మౌనాన్ని వీడి చేసిన వ్యాఖ్యలవి. ఆ వ్యాఖ్యలు మణిపూర్ దుర్మార్గాలపై , హింసపై స్పందించినట్టుగా ఉందా ? ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ప్రస్తావిస్తూ అక్కడ జరిగినట్టే మణిపూర్ లో కూడా జరుగుతున్నాయని సమస్యను చిన్నదిగా చేసి చూపడం, మరో వైపు తాను తప్పించుకోవడం కోసం ప్రతిపక్షాలపై దాడి చేసినట్టుగా లేదా ? కనీసం ముగ్గురు మహిళలపై జరిగిన ఘోరాన్ని ఆయన ప్రస్తావించారా లేదా అనే విషయం మీకేమైనా అర్దమైందా ?
ఈమణిపూర్ సంక్షోభాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని దాన్ని మరింతగా పెంచి పోషించే రాజకీయ పక్షాలు నిజంగా ఈ పరిస్థితిని అంతం చేయగలరా?
There are hundreds of such cases happening here. Only one video leaked. That is why the internet is banned in the state – Manipur CM N Biren Singh.pic.twitter.com/DHONyJ6lnX
— Ravi Nair (@t_d_h_nair) July 20, 2023