హైదరాబాద్ Hyderabad లో బారీగా వర్షం కురుస్తోంది. . ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం Heavy Rain కారణంగా ఒక గంటలో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్య
హైదరాబాద్ Hyderabad లో బారీగా వర్షం కురుస్తోంది. . ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం Heavy Rain కారణంగా ఒక గంటలో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ధట్టమైన మేఘాలు అలుముకున్నాయి.
దాదాపు హైదరాబాద్ నగరమంతా ట్రాఫిక్ జామ్ Traffic Jam ఏర్పడింది. వాహనాలు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళడానికి గంట సమయం పడుతోంది.
హైదరాబాద్ – విజయవాడ Vijayawada రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్, చైతన్యపురి, గుడి మల్కాపూర్, నాంపల్లి, మల్‌కపేట, దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్, పంజాగుట్టా, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, సుల్తాన్‌బజార్, బేగంబజార్, బషీర్‌బాగ్ కూకట్‌పల్లి, కాచిగూడ, విద్యానగర్, అంబర్‌పేట, ఉప్పల్, ఘట్కేసర్, రాజేంద్రనగర్, గండిపేట, కోఠి, అబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులపడుతున్నారు. రోడ్లు నీళ్ళతో నిండి ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్ – విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచాయి. వర్షంధాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో DRF బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా DRF టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. అవసరముంటే 040-21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలని డీఆర్‌ఎఫ్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి రావ్దొదని కోరింది.