మణిపూర్ Manipur లో జరుగుతున్న జాతి హింసపై ప్రధాని నరేంద్ర మోడీ Narendra Modi నుండి సరైన స్పందన లేకపోవడం, ఆలస్యంగా స్పందించడం పట్ల మణిపూర్‌కు చెందిన
మణిపూర్ Manipur లో జరుగుతున్న జాతి హింసపై ప్రధాని నరేంద్ర మోడీ Narendra Modi నుండి సరైన స్పందన లేకపోవడం, ఆలస్యంగా స్పందించడం పట్ల మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే BJP MLAలు, బీజేపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలందరూ ప్రధాని మోడీని కలవడాని ప్రయత్నించినా ఆయన అపాయింట్ ఇవ్వకపోవడం పట్ల వాళ్ళు మండిపడుతున్నారు.
కుకీ-జోమి Kuki jomi కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పావోలియన్‌లాల్ హౌకిప్ Haokip, Newslaundryకి ఇచ్చిన ఇంటర్వ్యూలో PM మోడీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రాధాన్యతలు పూర్తిగా తప్పుగా ఉన్నాయని ఆరోపించారు.
మోడీ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని వద్దకు వెళ్లేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ప్రధాని తిరస్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న హత్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వడం ప్రాథమిక మానవత్వానికి సంబంధించిన అంశమని హాకిప్ అభిప్రాయపడ్డారు.
“ప్రజాప్రతినిధులుగా మేము ప్రధానమంత్రిని అపాయింట్‌మెంట్ కోరాము, కానీ ఆయన నుండి స్పందన లేదు. పరిస్థితి యొక్క సీరియస్ నెస్ గురించి అతనికి తెలియజేయడానికి మేము ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము, ”అని హాకిప్ చెప్పారు.
గిరిజన సమూహాన్ని రక్షించడంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ N Biren Singh నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ “ప్రత్యేక పరిపాలన” కోసం డిమాండ్ చేస్తూ లేఖ రాసిన పది మంది కుకీ ఎమ్మెల్యేలలో హౌకిప్ కూడా ఉన్నారు. మణిపూర్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతో మెజారిటీ మెయిటీలు సాగిస్తున్న హింస, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుండి కుకీ తెగను వేరు చేసిందని వారు పేర్కొన్నారు. మహిళలపై జరిగిన నాలుగు నేరాలను కూడా శాసనసభ్యులు ఉదహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి సమస్య వెళ్ళాలంటే దౌర్జన్యానికి సంబంధించిన వీడియో సాక్ష్యం అవసరమా అని హాకీప్ ప్రశ్నించారు. దాదాపు రెండు నెలల క్రితమే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పటికీ ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వీడియో గురించి ఇటీవలే తనకు తెలిసిందని ముఖ్యమంత్రి ఎలా చెప్పుకుంటున్నారని హకీప్ ప్రశ్నించారు. ఇది పూర్తి అసమర్థత లేదా ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం అని హాకిప్ ఆరోపించారు.
పార్టీకన్నా, పొత్తులకన్నా మానవ హక్కులు, మనుషుల ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు హకీమ్. రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా వ్యక్తుల శ్రేయస్సును ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడం చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.