దక్షిణాఫ్రికా South Africa లోని జోహన్నెస్‌బర్గ్‌లోJohannesburg జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ BRICS Summitకు హాజరుకావద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ Vladim
దక్షిణాఫ్రికా South Africa లోని జోహన్నెస్‌బర్గ్‌లోJohannesburg జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ BRICS Summitకు హాజరుకావద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ Vladimir Putin నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం నేపథ్యంలో యుద్దనేరాల ఆరోణలతో పుతిన్ పై అంతర్జాతీయ్త న్యాయస్థానం ICC అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు International Criminal Courtను స్థాపించిన ఒప్పందంలో దక్షిణాఫ్రికా సంతకం చేసినందున తమకు పుతిన్ ను అరెస్టు చేయడం తప్ప మరో మార్గం లేనందున పుతిన్ ను ఈ సమావేశానికి రావద్దని దక్షిణాఫ్రికా పుతిన్ ను కోరింది.
ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా Ramaphosa రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. ఇద్దరి సంభాషణల ఒకరోజు తర్వాత బ్రిక్స్ సమ్మిట్‌కు పుతిన్ బదులు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ హాజరవుతారని రష్యా ప్రకటించింది.
ఈ ఏడాది మార్చిలో, ఉక్రెయిన్ Ukraineలో రష్యా అధ్యక్షుడి చర్యల కారణంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా దాడులు, ఆక్రమిత ప్రాంతాల్లో క్రమబద్ధంగా ప్రజలను హింసించడం, చంపడం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాల కారణంగా ఈ అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ పేర్కొంది.
పుతిన్ యుద్ధ నేరాలు:
మారియుపోల్ Mariupolలోని ఒక థియేటర్‌పై రష్యా వైమానిక దాడి చేసి లోపల ఆశ్రయం పొందుతున్న వందలాది మందిని చంపిందని న UN భద్రతా మండలి నివేదించింది. ఈ సంఘటనను భద్రతా మండలి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మాస్కో అనేక సందర్భాలలో యుద్ధ నేరాలకు పాల్పడుతూనే ఉందని పేర్కొంది.
కాగా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును స్థాపించే ఒప్పందంపై సంతకం చేసినందున, ఉక్రెయిన్ నుండి పిల్లల అపహరణతదితర యుద్ధ నేరాలకు సంబంధించి మార్చిలో పుతిన్ పై కోర్టు జారీ చేసిన నేరారోపణపై దక్షిణాఫ్రికా పుతిన్‌ను అరెస్టు చేయాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికా ప్రభుత్వం పుతిన్ అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశాలు వెతుకుతోంది.అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు, హక్కుల సంఘాలు, న్యాయ కార్యకర్తలు అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆపని చేయకపోతే తామే ఆ పని చేస్తామని ఆయా పార్టీలి, సంఘాలు హెచ్చరించాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఇప్పటి వరకు ఖండించని దక్షిణాఫ్రికాకు పుతిన్ ను అరెస్టు చేయడం సుతారామూ ఇష్టం లేదు. అయితే పుతిన్ తమ దేశం వచ్చినా అరెస్టు చేయకపోతే పశ్చిమ దేశాలతో సంబంధాలను మరింత దిగజార్చుకునే అవకాశాన్ని ఎదుర్కొంటుంది. అందుకే పుతిన్ ఈ సమావేశానికి రాకుండా చేసి ఈ సమస్య నుండి దక్షిణాఫ్రికా బైటపడింది.