HomeNational

అట్లుంటది మనతోని..టీవీ రిపోర్టర్లా మజాకా ?

అట్లుంటది మనతోని..టీవీ రిపోర్టర్లా మజాకా ?

ఉత్తర భారతం వరదలతో ముంచెత్తుతోంది. వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. దాదాపు 100 మంది మరణించారు. ప్రజలను వరదల్లోంచి రక్షించేం

ట్యూషన్ టీచర్ ను పొడిచి చంపిన బాలుడు
ఢిల్లీలో భారీ భూకంపం
రాహుల్ గాంధీ యాత్ర కోసం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి

ఉత్తర భారతం వరదలతో ముంచెత్తుతోంది. వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. దాదాపు 100 మంది మరణించారు. ప్రజలను వరదల్లోంచి రక్షించేందుకు NDRF బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే సందెట్లో సడేమియా అన్న రీతిలో ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో నెటిజనులకు ఆగ్రహం తెప్పిస్తుండగా మరికొందరు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.

ఢిల్లీలో వరదల నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ మెడలోతు నీటిలో రిపోర్టింగ్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఆమె తన రిపోర్టింగ్ కోసం NDRF స్క్వాడ్‌కు అందించిన పరికరాలను ఉపయోగించడాన్ని చూడవచ్చు. ఈ వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రత్తన్ ధిల్లాన్ అనే వినియోగదారుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక మహిళా జర్నలిస్ట్ నీటిలో మునిగిపోకుండా తన శరీరం చుట్టూ సేఫ్టీ ట్యూబ్‌ని ధరించి వరద నీటిలో రిపోర్టింగ్ చేస్తున్నది. కొంతమంది NDRF సిబ్బంది రెస్క్యూ బోట్‌లో ఆమెకు దగ్గరగా కనిపిస్తారు. వారిలో ఒకరు ఆ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తున్న‌ వీడియోను చిత్రీకరించారు. జర్నలిస్ట్ రిపోర్టింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వగా మరొక NDRF సిబ్బంది ఆమె ఫోటోలు తీయడం చూడవచ్చు.

ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధిల్లాన్ తన ట్విట్టర్‌లో వీడియో షేర్ చేస్తూ, “ఇది ఎలాంటి వార్తా రిపోర్టింగ్? ఆమె NDRF వాలంటీర్‌ని కేవలం రిపోర్టింగ్ కోసం ఉపయోగించుకుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించడం కంటే. ప్రభుత్వం వద్ద ఉన్న పరిమిత పడవలు కూడా వార్తా నివేదికల కోసం ఉపయోగించబడుతున్నాయి. క్షమించండి మాకు ఇలాంటి వార్తలు వద్దు” అని వ్యాఖ్యానించారు.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, తన వ్యక్తిగత అవసరం కోసం NDRF పరికరాలను ఉపయోగించినందుకు రిపోర్టర్‌ను అనేక మంది నిందించారు. అలాంటి రిపోర్టింగ్ ను చేసినందుకు కొందరు రిపోర్టర్, ఆమె పనిచేసే న్యూస్ ఛానెల్‌ని విమర్శించడం కూడా కనిపించింది.
“ప్రభుత్వం ఈ జోకర్లను నిషేధించాలి” అని రిపోర్టర్ చేసిన పనిని విమర్శిస్తూ ఒక వినియోగదారు అన్నారు.

మరో వినియోగదారు జర్నలిస్టు పట్ల శ్రద్ధ చూపుతూ ఇలా వ్యాఖ్యానించారు, “మురుగు నీటిలో, ఆమెకు రాబోయే కొద్ది రోజులకు యాంటీ బయోటిక్ క్రీమ్ చాలా అవసరం”

“రిపోర్టర్లు తమ పనిని సరిగ్గా చేయాలి. ఢిల్లీలో ఏ రహదారి మూసివేయబడింది, ఎక్కడ తెరిచి ఉందో ప్రజలకు చెప్పాలి. ఇడియట్స్ స్వయంగా వెళ్లి నీటిలో కూర్చున్నారు” అని ఒక నెటిజన్ మండిపడ్డారు.

మరో నెటిజన్ ఈ చర్యకు విస్మయానికి గురై, “గజబ్… ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది.” అని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ మధ్యకాలంలో రిపోర్టింగ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నామని భ్రమపడుతూ, కొందరు రిపోర్టర్లు, మరి కొందరు యాంకర్లు, వారిని నడిపించే బాస్ లు వేస్తున్న వేశాలు జోకర్లను తలపిస్తున్నాయి. బాత్ టబ్ లో పడుకొని రిపోర్టింగ్ చేయడం, నీళ్ళలో మనిషి భుజంపై కూర్చొని రిపోర్టింగ్ చేయడం, గాడిదమీద కూర్చొని రిపోర్టింగ్ చేయడం…ఇలా ఒకటేమిటి ప్రజలకు వార్తలను, సమాచారాన్ని అందించాల్సిన జర్నలిస్టులు నటులుగా మారిపోతుండటం అంటే న్యూస్ ను ఎంటర్టైన్ మెంట్ గా మార్చేసినట్టేనా ?