HomeUncategorized

టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి

టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి

బెంగళూరుకు చెందిన ప్రైవేట్ టెక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆ సంస్థ మాజీ ఉద్యోగి హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం

బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు
ఆయనికిస్తున్నది అవార్డా లేక జరిమానా రిసిప్టా ? చెప్పుకోండి చూద్దాం!

బెంగళూరుకు చెందిన ప్రైవేట్ టెక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆ సంస్థ మాజీ ఉద్యోగి హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

కర్ణాటకలోని బెంగళూరులోని అమృతహళ్లిలోని పంపా ఎక్స్‌టెన్షన్‌లో పట్టపగలు ఈ ఘటన జరిగింది.

“మృతులను ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ CEO విను కుమార్, MD పనీంద్ర సుబ్రమణ్యగా గుర్తించారు, ఇద్దరూ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు” అని అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఫెలిక్స్ ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలోకి చొరబడి కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు.

దాడి చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఈశాన్య బెంగళూరు డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు.

ఫెలిక్స్ గతంలో ఏరోనిక్స్‌లో పని చేసేవాడు. కానీ తన సొంత కంపెనీని స్థాపించడానికి అతను ఈ కం పెనీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అయితే అతను కొత్తగా ప్రారంభించిన‌ వ్యాపారానికి ఈ ఇద్దరు అడుగడుగునా అడ్డుపడుతున్నారని సమాచారం. ఆ కోపంతోనే ఫెలిక్స్ ఆ ఇద్దరిని నరికి చంపిఉనట్టు ప్రాథమిక నివేదికలను బట్టి తెలుస్తోంది.