HomeTelanganaPolitics

వ్యాగన్ల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మోడీ…కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని, రిపేర్ షాపు ఇస్తారా అంటూ ప్రశ్నించిన కేటీఆర్

వ్యాగన్ల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మోడీ…కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని, రిపేర్ షాపు ఇస్తారా అంటూ ప్రశ్నించిన కేటీఆర్

వరంగల్ లో ఈ రోజు రైల్వే రైలు వ్యాగన్ల ఫ్యాక్టరీ ని ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. దానితో పాటు జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్ హైవే పనులు,మ

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు
అరెస్ట్ తో చంద్రబాబు మైలేజీ పెరిగింది, జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు… బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఈ మూవీ తెలంగాణలో బీజేపీకి ఓట్లను రాలుస్తుందా ?

వరంగల్ లో ఈ రోజు రైల్వే రైలు వ్యాగన్ల ఫ్యాక్టరీ ని ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. దానితో పాటు జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్ హైవే పనులు,మంచిర్యాల-వరంగల్‌ నేషనల్ హైవే పనులకు కూడా శంకుస్థాపన చేశారు. వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ ఇక్కడి ను‍ంచే ఆ మూడు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ‘‘ తెలం గాణ దేశాభివృ ద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు మోడీ. తెలంగాణ అభివృ ద్ధి కోసం కేంద్రం అనేక నిధులు మంజూరు చేస్తోన్నదని ప్రధాని తెలిపారు. ఈ రోజు రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభిం చుకుం టున్నామన్నారు మోడీ. ”అనేక కారిడార్లను పూర్తి చేసుకుం టున్నాం . హైవేలు, ఎక్స్ ప్రెస్వేలు, ఇం డస్ట్రియల్-ఎకనామిక్ కారిడార్లు ఏర్పా టు చేస్తున్నాం . తెలం గాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యా త్మి క పర్యా టక కేంద్రాలున్నా యి.
కరీం నగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అం దిస్తుం ది. రైల్వే ఉత్ప త్తుల విషయం లో రికార్డులు
సృ ష్టిస్తున్నాం . తెలం గాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెం చుతున్నాం ’’ అని ప్రధాని మోదీ అన్నారు మోడీ.

ఈ సందర్భంగా ప్రధాని రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల ఫ్యాక్టరీ,రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ నేషనల్ హైవే పనులు,రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్‌ నేషనల్ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.

కాగా మోడీ రాకకు ముంది తెలంగాణ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ లో మోడీపై విమర్శల వర్షం కురిపించారు.
”ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణ, వరంగల్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మాకు పూర్తిగా నిరాశ కలిగించే విధంగా, NDA ప్రభుత్వం అదే ఫ్యాక్టరీని 20,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌కు తరలించింది.

520 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణాలో ఈరోజు ప్రతిపాదిస్తున్న వ్యాగన్ రిపేర్ షెడ్ తెలంగాణ ప్రజలను అవమానించడమే .

ఒక ప్రధానమంత్రిగా, తెలంగాణకు జరుగుతున్న సెకండ్ క్లాస్ ట్రీట్‌మెంట్‌పై మీ ప్రభుత్వం బహిరంగ వివరణ ఇవ్వాలి” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో, ”తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం బయ్యారంలో సమీకృత ఉక్కు కర్మాగారం కోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు.

9 సంవత్సరాల తర్వాత, అనేక రిమైండర్‌ల తర్వాత కూడా, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు తిరస్కరించడం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.

బయ్యారంలో ఇనుప ఖనిజం తో సహా భూమి, నీరు, విద్యుత్, బొగ్గు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి వరకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి. తెలంగాణ పట్ల మీరు చూపిస్తున్న‌ ఉదాసీనత ఆందోళన కలిగిస్తుంది. మీ ధోరణి 15,000 మంది స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలను లేకుండా చేసింది.

తెలంగాణ పర్యటనలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి గట్టి ప్రతిజ్ఞ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.” అన్నారు కేటీఆర్.
అదే విధంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును కూడా కేంద్ర బీజేపీ సర్కార్5 పట్టించుకోకపోవడం పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.