HomeNational

యూనిఫాం సివిల్ కోడ్ కు మేము వ్యతిరేకంకాదు…అయినా మద్దతివ్వం -మాయావతి భావమేమి తిరమలేశా ?

యూనిఫాం సివిల్ కోడ్ కు మేము వ్యతిరేకంకాదు…అయినా మద్దతివ్వం -మాయావతి భావమేమి తిరమలేశా ?

కేంద్ర బీజేపీ సర్కార్ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) తేవాలనే ప్రయత్నంలో ఉంది. త్వరలో ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయాలని దూకుడుగా వెళ్తున్న

టీచర్ ముసుగులో మతోన్మాది..ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన ఉపాధ్యాయురాలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా గాంధీ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

కేంద్ర బీజేపీ సర్కార్ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) తేవాలనే ప్రయత్నంలో ఉంది. త్వరలో ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయాలని దూకుడుగా వెళ్తున్నది. అయితే ఈ బిల్లుకు మద్దతు తెలపడం విషయంలో ప్రతిపక్షాల్లోనే చీలిక వచ్చింది. ఒక్కొక్కరి రంగు మెల్లెగా బైటపడుతోంది.

బీజేపీతో వీర లెవల్లో పోరాడుతున్నానని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ UCC బిల్లుకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. మరి కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి యూనిఫాం సివిల్ కోడ్ కు తాము వ్యతిరేకంకాదని ప్రకటించారు. అయితే అంతలోనే ఓ మెలిక పెట్టారు. వ్యతిరేకంకాదు కానీ మద్దతు అయితే తెలపం అని ప్రకటించారు.

మాయావతి ఆదివారం మాట్లాడుతూ, తమ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) ఆలోచనకు వ్యతిరేకం కాదని, అయితే బిజెపి ప్రభుత్వం దేశంలో దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని ఆమోదించడం లేదని అన్నారు.
పౌరులందరికీ యుసిసి ఉండాల‌ని రాజ్యాంగంలో పేర్కొన్నారని, అయితే దానిని విధించే నిబంధన లేదని మాయావతి అన్నారు.

ఏకాభిప్రాయం, అవగాహన ద్వారా దీనిని అమలు చేయాలని ఆమె లక్నోలో విలేకరుల సమావేశంలో అన్నారు.

“అయితే, అది (అవగాహన , ఏకాభిప్రాయం) జరగడం లేదు. యుసిసి ముసుగులో సంకుచిత రాజకీయాలకు పాల్పడటం దేశానికి ప్రయోజనం కాదు. ” అని ఆమె అన్నారు.

“మా పార్టీ UCCకి వ్యతిరేకం కాదు, కానీ అది దేశంలో బిజెపి, వారి ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని ఆమోదించము” అని ఆమె అన్నారు.

దేశవ్యాప్తం గా బీజేపీ బలహీనపడిన నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు సంపాధించాలని బీజేపీ UCC ని మళ్ళీ ముందుకు తీసుకవచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఏదేమైనా UCCని చట్టం చేసి తీరుతామని బీజేపీ పట్టుదలగా ఉంది. అయితే ఈ విషయంలో పలు ప్రతిపక్షాల చర్యలే అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి.