HomeTelanganaPolitics

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు!

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు!

*** క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు! కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేత అన్నగా అండగా ఉంటానని భరోసా హైదరాబాద్ 25,

‘బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా’
ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
విద్యార్థులు యువతకు నైపుణ్యమైన శిక్షణ..సింగపూర్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందం

*** క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు!

  • కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేత
  • అన్నగా అండగా ఉంటానని భరోసా

హైదరాబాద్ 25, మార్చి, 2025:

“సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా.. నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్” క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ యువకుడి మాటలివి. వింటే మనసున్న ప్రతీ మనిషికీ గుండె చెమర్చక మానదు. ఈ మాటలకే మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయ్ పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్ కాన్సర్ తో బాధపడుతూ… ఖాజాగూడలోని లోని స్పర్ష్ హస్పీస్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. నేనున్నానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా నితిన్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న శ్రీధర్ బాబు.. అప్పటికప్పుడు క్రికెట్ కిట్ తెప్పించి అతని కోరికను నెరవేర్చారు. సొంతన్నగా వెంట నిలుస్తానని, ఏ అవసరమున్నా నేరుగా నన్ను సంప్రదించండి అంటూ నితిన్ తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు.