HomeTelanganaPolitics

ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…బోల్తాపడ్డ ఆటో…. ఏడుగురు కూలీలకు గాయాలు…

ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…బోల్తాపడ్డ ఆటో…. ఏడుగురు కూలీలకు గాయాలు…

ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం… •బోల్తాపడ్డ ఆటో…. ఏడుగురు కూలీలకు గాయాలు… •కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు •అనంతగిరి మండలం బొజ

‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’
బీహార్ కాల్పుల సంఘటనలో షాకింగ్ ట్విస్ట్… కాల్చింది పోలీసులు కాదట‌! మరెవరు ?
రాహుల్ గా‍ంధీ యాత్రపై కేసు నమోదు

ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

•బోల్తాపడ్డ ఆటో…. ఏడుగురు కూలీలకు గాయాలు…

•కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

•అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ శివారులో ప్రమాదం

కోదాడ,నినాదం:
పొట్టకూటి కోసం రోడ్డు పనికి వెళుతున్న ఏడుగురు కూలీలు ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. … స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కోదాడ పట్టణానికి చెందిన ఏడుగురు కూలీలు అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ సీసీ రోడ్డు పనులకు రోజువారి వచ్చి వెళ్తున్నారు. ఇదే క్రమంలో శనివారం సైతం కోదాడ పట్టణం నుండి బొజ్జగూడెం తండకు టాటా ఏసీ ఆటోలో బయలుదేరి వస్తుండగా, బొజ్జగూడెం తండా గ్రామం లోపల కు వెళ్లే రహదారి వద్ద ఆటో అదుపుతప్పి పంట పొలాల్లో పడిపోయింది. దీంతో ఏడుగురు కూలీలకు గాయాల కావడంతో హుటాహుటిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.