భారతదేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్..మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్: పీవీ నర్సింహారావుతో కలిసి దేశ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ బాట
భారతదేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్..
మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: పీవీ నర్సింహారావుతో కలిసి దేశ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ బాటలు వేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు
ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం (డిసెంబర్ 30) ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 1991లో మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిని చేసి తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు నూతన శకానికి నాంది పలికారని పేర్కొన్నారు.దేశ రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ ఒక మహోన్నత శిఖమరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
పీవీ నర్సింహారావుతో కలిసి దేశ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ బాటలు వేశారన్నారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. భారత దేశ అభివృదికి పాటుపడిన
గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. భారత దేశ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ ఎన్నో గొప్ప విధానాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చింది మన్మోహన్ సింగేనని గుర్తు చేశారు.2024, డిసెంబర్ 26వ తేదీన అనారోగ్యంతో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన సింగ్ కు సంతాపం తెలపాలని తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ భేటీ అయ్యి.. మన్మోహన్ సింగ్కు నివాళుర్పించారు సభ్యులు.