HomeTelanganaUncategorized

హైదరాబాద్ మెట్రో ,ఔటర్ రింగ్ రోడ్డు మన్మోహన్ సింగ్ వల్లే సాధ్యమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ మెట్రో ,ఔటర్ రింగ్ రోడ్డు మన్మోహన్ సింగ్ వల్లే సాధ్యమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్

శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగం ముఖ్యాంశాలు.. ముఖ్యమంత్రి గారి ప్రతిపాదించిన విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాల

50 వేల మెజార్టీ రాకుంటే పార్టీకి రాజీనామా చేస్తా!
తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?
BJP Khammam Meeting: BRSతో బైటికి కుస్తీ లోపల దోస్తీ

శాసన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగం ముఖ్యాంశాలు..

ముఖ్యమంత్రి గారి ప్రతిపాదించిన విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాలని,
హైదరాబాద్ లో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మద్దతు తెలుపుతున్న..

మన్మోహన్ సింగ్ గారితో పాటు 15 వ లోక్ సభలో 5 సంవత్సరాలు కలిసి పని చేయడం జరిగింది..

ఆయన ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేశారు..

ఆయన హయంలో 42 మంది ఎంపీల్లో 33 మంది ఎంపీలకు కన్వీనర్ గా చేశా..

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ది ఫీల్ పొందారు..

కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు..

పంజాబ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేశారు..

ఆర్బిఐ గవర్నర్ గా కొత్త కొత్త చట్టాలు తెచ్చారు..

బ్యాంకుల్లో అనేక సంస్కరణలు చేశారు..

పీవీ నరసింహారావు గారి హయంలో ఆర్థిక మంత్రి గా ఎన్నో సంస్కరణలు చేశారు..

2004-14 మధ్య ప్రధాని గా దేశ రూపురేఖలు మార్చారు..

అనేక పథకాలు, చట్టాలు తీసుకొచ్చారు..

ఆహార భద్రత చట్టం ,భూ సేకరణ చట్టం ,స్ట్రీట్ వెండర్స్ చట్టం తెచ్చారు..

ఓబీసీ పార్లమెంటు సభ్యుడిగా కమిటీ కి సభ్యుడిగా ఉన్న..

ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్న..

వారీ హయంలో కరీంనగర్ పార్లమెంటు లో 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం..

ఆర్థిక మంత్రి గా 1991-96 మధ్య మైనార్టీ లో ఉన్న ప్రభుత్వంలో ఆయన ఆర్థికపరమైన ఎన్నో సంస్కరణలు చేశారు..

పీవీ నరసింహారావు గారి సెక్రటరీ మనోహ్మన్ సింగ్ గారికి కాల్ చేసి మీరు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నారని చెప్పారు..ఆయన నమ్మలేని పరిస్థితి లో ఉండేదనీ ఆయన చెప్పారు.. స్వయంగా పీవీ గారు ఆయనను పిలిచి ఆర్థిక మంత్రి చేశారు .

గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి
ఉపాధి హామీ చట్టం తెచ్చారు.

ప్రభుత్వం పారదర్శకత పై తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు..

భూసేకరణ చట్టం ,ఆహార భద్రత చట్టం తెచ్చారు.

72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారు..అందులో 12 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి చేశారు..

తెలంగాణ ఇవ్వడానికి ఆయన ఎంతో కృషి చేశారు..

హైదరాబాద్ మెట్రో ,ఔటర్ రింగ్ రోడ్డు ఆయన వల్లే సాధ్యమైంది..

భారత్ తన కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు సంతాపాన్ని తెలిపారు .

మంచి మిత్రుడని కోల్పోయామని అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ తెలిపారు..

90 సంవత్సరాల వయసులో కూడా రాజ్యసభ కి వచ్చి ఒక బిల్లులో పాల్గొని ప్రజాస్వామ్యంలో చట్టసభలపై తనకున్న గౌరవం పై మనందరికీ స్పూర్తినిచ్చరు..

పీవీ నరసింహారావు ప్రధానిగా వంగర మా కరీంనగర్ జిల్లాలో ఉంది అని నేను ఆయన దృష్టికి తీసుకుపోతే సిరిసిల్ల , కరీంనగర్ లకు కేంద్రీయ విద్యాలయాల తీసుకొచ్చాం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు

తెలంగాణ బిల్లు రాజ్యసభలో బిల్లు పాస్ కాకపోతే మళ్ళీ లోక్ సభ లో సవరణ చేయాల్సి. వస్తుందని ఎల్ కే అద్వానీ, వెంకయ్య నాయుడు గార్లని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి బిల్లు ఆమోదించుకోవడంలో ఆయన పాత్ర మరువలేనిది..

మన్మోహన్ సింగ్ గారితో కలిసి 5 సంవత్సరాలు వారితో ఉన్న అనుభవాన్ని జ్ఞప్తికి చేసుకుంటూన్న .

వారికి భారత రత్న ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని సమర్థిస్తున్న