HomeTelanganaNational

తెలంగాణ లో ఎన్కౌంటర్ లను వెంటనే ఆపాలి.న్యాయవిచారణ జరిపించాలి…మాజి ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్

తెలంగాణ లో ఎన్కౌంటర్ లను వెంటనే ఆపాలి.న్యాయవిచారణ జరిపించాలి…మాజి ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్

----తెలంగాణ లో ఎన్కౌంటర్ లను వెంటనే ఆపాలి. ఎన్కౌంటర్ లపై న్యాయవిచారణ జరిపించాలి. ప్రజా ప్రభుత్వం అంటూనే ఎన్కౌంటర్ లా? ఆందోల్ మాజి ఎం ఎల్ ఏ క

ఉచిత విధ్యుత్తు వ్యాఖ్యలపై రేవంత్ తొలి స్పందన…ఇకనైనా రచ్చ ఆగేనా?
కాంగ్రెస్ లోకి మైనంపల్లి హనుమంత రావు
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు

—-తెలంగాణ లో ఎన్కౌంటర్ లను వెంటనే ఆపాలి.

ఎన్కౌంటర్ లపై న్యాయవిచారణ జరిపించాలి.

ప్రజా ప్రభుత్వం అంటూనే ఎన్కౌంటర్ లా?

ఆందోల్ మాజి ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్

తెలంగాణ లో ఎన్కౌంటర్ ల ను ఆపాలని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్కౌంటర్ లు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్ల తోనే మార్పు వస్తుందని పలుమార్లు చెప్పిన రెవంత్ రెడ్డి గారి హయాంలో ఎన్కౌంటర్ లు ఎలా జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. సాయుదు లైన వ్యక్తులను సజీవంగా పట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే చంపి ఎన్కౌంటర్ కథలు అల్లుతున్నారని ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి ఎన్కౌంటర్ లను వెంటనే ఆపాలని ఆయన డిమాండు చేశారు. ఎన్కౌంటర్ మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.