HomeTelanganaPolitics

పిఎల్ జి ఏ వార్షికోత్సవాలను విప్లవోత్సాహం తో జరుపుకుందాం..ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు

పిఎల్ జి ఏ వార్షికోత్సవాలను విప్లవోత్సాహం తో జరుపుకుందాం..ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు

పి ఎల్ జి ఏ వార్షికోత్సవాలను విప్లవోత్సాహం తో జరుపుకుందాం ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు (నినాదం స్టేట్ బ్యూరో చీఫ్ ,గంగుల రాంగోపాల్ ) పి

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
నాన్న ఆశయాలు కొనసాగిద్దాం -అమరుడు సాయిబాబా కూతురు మంజీరా
తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

పి ఎల్ జి ఏ వార్షికోత్సవాలను విప్లవోత్సాహం తో జరుపుకుందాం

ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపు

(నినాదం స్టేట్ బ్యూరో చీఫ్ ,గంగుల రాంగోపాల్ )

పి ఎల్ జి ఏ 24 వ వార్షికోత్సవాలను విప్లవత్సాహంతో జరుపుకోవాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ప్రకటన యధాతధంగా ఈ క్రింది విధంగా ఉంది.

పీ.ఎల్.జీ.ఏ. 24వ వార్షికోత్సవాలను 2024 డిసెంబర్ 2 నుండి 8 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకుందాం! ప్రజాపునాదిని, స్వీయాత్మక శక్తులను పెంచుకుందాం. పార్టీ, పీ. ఎల్.జీ.ఏ., ఐక్యసంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేద్దాం! విప్లవోద్యమ నిర్మూలనకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘కగార్’ విప్లవ ప్రతీఘాతుక యుద్ధాన్ని తిప్పికొడుదాం!

2024 డిసెంబర్ 2 నాటికి పీ.ఎల్.జీ.ఏ. (ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం)కి 24 సంవత్సరాలు నిండుతాయి. 24 సంవత్సరాల వార్షికోత్సవాలను పురష్కరించుకొని డిసెంబర్ 2 నుండి 8 వరకు పీ.ఎల్.జీ.ఏ. వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సాహంతో జరపాల్సిందిగా రాష్ట్రంలోని విప్లవ ప్రజలకు, పార్టీ శ్రేణులకు, పార్టీ కమిటీలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది.

దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయ సాధన కోసం ప్రజాయుద్ధం కొనసాగిస్తున్న పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. తెలంగాణలో శతృవు కల్పించిన ప్రతికూల పరిస్థితుల నడుమ విప్లవోద్యమ ప్రజా పునాదిని బలోపేతం చేయడానికి గత సంవత్సర కాల రాజకీయ, నిర్మాణ, సైనిక కృషిలో భాగమైన పీ.ఎల్.జీ.ఏ. పార్టీ కమిటీలకు, శ్రేణులకు విప్లవ ప్రజానికానికి, సంఘాలకు, నాయకులకు, కార్యకర్తలకు, మిలిషియాలకు, అరెస్టు అయి భౌతికంగా, మానసికంగా వేధింపులను ధిక్కరించి, మొక్కవోని దీక్షతో దుర్భర జైల్ జీవితాన్ని అనుభవిస్తున్న విప్లవకారులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ మనస్ఫూర్తిగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నది.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు, విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకంలో భాగంగా కగార్ ఆపరేషన్ పేరుతో కొనసాగిస్తున్న శతృవు దుష్ట పథకానికి తలవంచక భీకర యుద్ధాన్ని త్యాగనిరతితో, అసమాన ధైర్యసాహాసాలతో ప్రతిఘటిస్తూ పీ.ఎల్.జీ.ఏ. వార్షిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 254 మంది వీర గెరిల్లాలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. తెలంగాణ విప్లవోద్యమ కృషిలో కంపెనీ పార్టీ కమిటీ కార్యదర్శి, కమాండర్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు లచ్చన్న, మంగు, వర్గేష్, ఏరియ కమిటీ సభ్యులు తులసి, రాము, మణిరామ్ సీనియర్ పార్టీ సభ్యులు విజెందర్, కోసి, గంగాల్, లక్ష్మణ్, దుర్గేష్, బుద్రు, రాజులు 13 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. దళిత, ఆదివాసీ, మత మైనార్టీ, పీడిత ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం దృఢంగా నిలిచి పోరాడిన కామ్రేడ్ సాయిబాబా 2024, అక్టోబర్ 12 నాడు కన్నుమూశాడు. జే.ఎన్. ఎమ్. కళాకారుడు ఫ్రంట్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రడం శ్రీను 2024, అక్టోబర్ 12 నాడు అనారోగ్యంతో కన్నుమూశాడు. విప్లవోద్యమ కృషిలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించిన వీర యోధులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది.

తెలంగాణలో మన పార్టీ తాత్కాలిక వెనకంజ వేసి అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. మావోయిస్టు నిర్మూలన కోసం శతృవు సెక్యూరిటీ క్యాంపులు ఏర్పార్చారు. రోడ్లు, కమ్యూనికేషన్, హ్యూమన్, సాంకేతిక నిఘా వ్యవస్థ, వందలాది శతృవు పోలీసు బలగాల కూంబింగ్ లు, దాడులు విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారాయి. అయిన్పటికీ దృఢ సంకల్పంతో ప్రతికూలతలను అధిగమించి అనేక త్యాగాలు చేస్తూ పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. నిలదొక్కుకుంటుంది. శక్తి మేరకు గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.

రాజకీయ, నిర్మాణ, సైనిక కృషిలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుంది. మత మైనార్టీలపై, మహిళలపై, దళితులపై, ఆదివాసీలపై భారత ప్రజలపై కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ పాశవిక దాడుల నుండి దేశాన్ని రక్షించడానికి అనేక ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కగార్ ఆపరేషన్ ను ప్రతిఘటిస్తూనే రాజకీయ ఆందోళనలు చేపట్టింది. పట్టణ, మైదాన, అటవి ప్రాంతాల్లో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ, భూస్వామ్య వ్యతిరేక, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాల వైపు కార్మికులను కదిలించింది. దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం కాలరాస్తున్న పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేపట్టింది. జల్, జంగల్, జమీన్, అధికారం, ఆస్థిత్వం కోసం చేస్తున్న ఆదివాసీల పోరాటాలకు నాయకత్వం వహించింది. అన్ని రంగాల ప్రజల మౌళిక సమస్యల పరిష్కారానికి అండగా నిలబడుతూనే ప్రజల రాజకీయాధికార కల సాధికారతకు గ్యారంటీనిస్తుంది. ఈ ప్రజాందోళల నుండి వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని పెంపొందించాల్సిన అవసరం వుంది.బ్రాహ్మణీయ హిందుత్వ పాలకులు దేశ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకం అమలులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టి భయంకరమైన నరసంహార యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం ప్రజలందరికి తెలిసిందే. 2047 వరకు బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యాన్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా బీకర యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. హిందుత్వ రాజ్యం కల సాధికారత కోసం “వికసిత్ భారత్” అని అంటున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపిల లక్ష్యానికి అడ్డంకిగా మారిన సంస్థలను, శక్తులను నిర్మూలిస్తున్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని, ముఖ్యంగా మావోయిస్టు భావజాలాన్ని తుడిచి పెట్టాలని కర్తవ్యం పెట్టుకున్నారు. హిందుత్వ వ్యతిరేక భావజాల సెక్యులర్ శక్తులను అర్బన్ నక్సలైట్స్ అనే ముద్ర వేసి అణిచివేస్తున్నారు. ప్రశ్నించే ప్రజాస్వామిక శక్తుల గొంతుకలను నులిమి వేస్తున్నారు.

తెలంగాణలో ఆర్ఎస్ఎస్, బీజేపిల లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి (కాంగ్రెసు) ప్రభుత్వం కంకణం కట్టుకుని పని చేస్తుంది. సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య, కార్పొరేట్ల లాభాల పల్లకిని భుజానికెత్తుకొని మోస్తున్నది. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టడానికి ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. పర్యావరణాన్ని దెబ్బతీసే గనులను, పర్యాటక కేంద్రాలు, ఫార్మాసిటీ, నేవి రాడార్ వంటి వినాసకర అభివృద్ధిని తీవ్రతరం చేస్తున్నది. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం, అడవుల కార్పొరేటీకరణ, భూముల కార్పొరేటీకరణ, వ్యవసాయ, సేవా, పారిశ్రామిక రంగాల కార్పొరేటీకరణ ఇలా సర్వం దేశీయ, విదేశీ దోపిడి వర్గాలకు అప్పగిస్తున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దోపిడి అనుకూల విధానాలను దూకుడుగా అమలు చేస్తుంది. పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాల రాస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన సంవత్సర కాలంలో శతృవు సాయుధ బలగాల ద్వారా కర్రెగుట్ట, రఘునాథపాలెం, దామెరతోగు అడవుల్లో దళాలపై దాడులు చేయించి 10 మంది విప్లవకారులను పొట్టన పెట్టుకుంది. జూన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి మావోయిస్టు పార్టీ నిర్మూలన కొరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బడ్జెట్ తో పాటు, ప్రత్యేక టాస్క్ పోర్స్ ను కెటాయించాలని కోరారు. ఆగస్టు 24 నాడు ఛత్తీస్ గడ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో జరిగిన సమావేశానికి, అక్టోబర్7న న్యూఢిల్లీలో జరిగిన వార్షిక సమావేశానికి రాష్ట్రం నుండి హాజరవుతూ 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలనే దుష్ట పథకాన్ని అమలు చేయడానికి పూనుకుంటున్నారు. 11 నవంబర్, 2024 భద్రాచలం దగ్గర ఉన్న సారపాకలో 4 రాష్ట్రాల డీజీపీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. నేడు కేంద్ర, రాష్ట్ర ఫాసిస్టు దోపిడి పాలకులంతా కుమ్మకై 2026 మార్చి వరకు డెడ్ లైన్ లు ప్రకటించి తీవ్రమైన అణిచివేత ప్రయోగిస్తున్నారు.

దేశ వ్వాప్తంగా విప్లవోద్యమ ప్రాంతాలంతటా కార్పెట్ సెక్యూరిటీ వ్యవస్థ సంఘటితపడి విప్లవోద్యమ ప్రాంతాలు దెబ్బతిని తాత్కాలికంగా వెనకంజ వేసిన మాట వాస్తవమే అయినప్పటకీ దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకు పీడిత ప్రజలపై, ప్రత్యేకించి మహిళలపై, మత మైనార్టీలపై, దళితులపై, ఆదివాసీలపై దోపిడి దౌర్జన్యాలు, అణిచివేత తీవ్రమవుతూనే వున్నాయి. దోపిడి పీడనలు వున్నంత కాలం విప్లవాలను శాశ్వతంగా అణిచివేయడం అసాధ్యం.

విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకాన్ని విఫలం చేద్దాం. ఆపరేషన్ కగార్ దాడిని ప్రతిఘటిస్తూ అసువులు బాసిన అమరుల త్యాగాలు, అసమాన ధైర్యసాహాసాలు అనుసరణీయమైనది. అమరులు స్ఫూర్తితో దృఢంగా పోరాడుదాం. మన ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం సాధించిన విజయాల ఉత్సాహాంతో 24వ పీ.ఎల్.జీ.ఏ. వార్షికోత్సవాలను జరుపుకుందాం. గెరిల్లా యుద్దం ద్వారా కగార్ దాడులను తిప్పికొడుతూ మన పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను రక్షించుకుందాం. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించి అంతిమంగా సోషలిజాన్ని-కమ్యూనిజాన్ని సాధించే లక్ష్యంతో విప్లవోద్యమాన్ని పురోగమింప చేద్దాం.