ద్వైపాక్షిక సంబంధాల పట్ల తుర్కియె ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణా (భారత్) తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్
ద్వైపాక్షిక సంబంధాల పట్ల తుర్కియె ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణా (భారత్) తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కియె దేశపు రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ఆయన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సచివాలంయలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇద్దరు అరగంట సేపు పరస్పర సహకారంపై చర్చించారు. తుర్కియె తెలంగాణాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతారణం ఉందని ఆయన తెలిపారు. తుర్కియె పారిశ్రమిక ప్రతినిధుల బృందాన్ని పంపిస్తే వారు ఇక్కడి ఎకోసిస్టమ్ ను పరిశీలించే అవకాశం ఉంటుందన్న అభ్యర్థనకు రాయబారి ఫిరట్ సునెల్ సుముఖత వ్యక్తం చేసారు. భేటీలో తుర్కియె కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యమన్ ఓకన్ కూడా పాల్గొన్నారు.