HomeUncategorizedGeneral

అంబేద్కర్అందరివాడు….అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి సీతక్క

అంబేద్కర్అందరివాడు….అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి సీతక్క

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి సీతక్క మంగపేట, నవంబర్ 26 ( నినాదం న్యూస్ ) : అంబేద్కర్ అందరివాడని, అంబేద్కర్ స్ఫూర్

షర్మిల, విజయమ్మపై కేసు వేసిన జగన్
హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న : మంత్రి పొన్నం ప్రభాకర్
ఎవర్ నార్త్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ఏర్పాటుతో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు.

అంబేద్కర్ అందరివాడు

  • అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి సీతక్క

మంగపేట, నవంబర్ 26 ( నినాదం న్యూస్ ) : అంబేద్కర్ అందరివాడని, అంబేద్కర్ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ ( సీతక్క ) అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో తెలంగాణా సెంటర్ లో అంబేద్కర్ యువజన సంఘం మంగపేట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి సీతక్క మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే అణగారిన వర్గాలకు అన్ని హక్కులు లభించాయని అన్నారు . అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి, ఆదివాసీ ఉద్యమకారుడు కొమురం భీమ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన కార్యక్రమాలలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం, కాంగ్రెస్ పార్టీ, పలు దళిత సంఘాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకుల పాల్గొన్నారు.