HomeTelanganaPolitics

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన

•కోదాడ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన.. •ఎంపిక చేశారు పట్టాలు మరిచారు.. కోదాడ,నవంబర్ 6(నినాదం న్యూస్):కోదాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట డబుల్ బెడ్ రూమ్

కరెంట్ బిల్లు బాకీ…ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కట్
బోనమెత్తిన అనంతగిరి…మండల వ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ
ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అధ్యక్షులుగా పిడమర్తి గాంధీ నియామకం

•కోదాడ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన..

•ఎంపిక చేశారు పట్టాలు మరిచారు..

కోదాడ,నవంబర్ 6
(నినాదం న్యూస్):
కోదాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన ఇండ్లకు పట్టాలి ఇవ్వాలని, మంజూరు చేసిన ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ భారీ సంఖ్యలో లబ్ధిదారులు కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. ఆందోళనకారులకు మద్దతుగా పట్టణ 35వ వార్డు కౌన్సిలర్ బెజవాడ శిరీష, శ్రవణ్ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ… గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 560 మంది లబ్ధిదారులను గుర్తించామ‌ని పేర్కొన్నారు.పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ళు కట్టించి మంజూరు చేయించారని గుర్తు చేశారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి కనీసం పట్టాలు ఇవ్వకుండా మౌలిక వసతులు కల్పించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు కేటాయించిన ఇండ్లలోకి వెళ్లేందుకు కూడా లబ్ధిదారులకు అనుమతి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఏఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.