HomeTelanganaCrime

స్కూల్ నే బార్ కమ్ లాడ్జిగా మార్చేసిన‌ టీచర్!

స్కూల్ నే బార్ కమ్ లాడ్జిగా మార్చేసిన‌ టీచర్!

•మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు… •ఆందోళనలో విద్యార్థులు కోదాడ(మోతే), నవంబర్ 5: ఉపాధ్యాయుడు అంటే పదిమందికి మార్గదర్శం. వారు చెప్పే విద్యాబుద్ధ

యోగి కి రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు…’మమ్ములను లైంగికంగావేధించిన ప్రిన్సిపాల్ RSS కార్యకర్త కాబట్టి పోలీసులు మమ్ములనే బెధిరిస్తున్నారు’
తెలంగాణ విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
హిమాన్షు అన్నా ప్లీజ్ మా స్కూల్ నూ దత్తత తీసుకోవా !

•మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు…

•ఆందోళనలో విద్యార్థులు

కోదాడ(మోతే), నవంబర్ 5:

ఉపాధ్యాయుడు అంటే పదిమందికి మార్గదర్శం. వారు చెప్పే విద్యాబుద్ధులు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలా అనేకమంది విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్ది ఉన్నత స్థానాలలో నిలబెట్టారు. కానీ కొన్ని చోట్ల ఉపాధ్యాయులు చేస్తున్న పని విద్యావ్యవస్థకు మాయని మచ్చగా కనిపిస్తుంది.

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యానికి బానిసై విద్యా వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్న ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలో చోటుచేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉపేందర్. రామాపురం తండాలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా గత మూడేళ్ళుగా పనిచేస్తున్నాడు. ఈ ఉపాధ్యాయుడికి మద్యం లేనిదే పూట గడవదు. ప్రతిరోజు పాఠశాలలో మద్యం, ధూమపానం ఉండాల్సిందే. నిత్యం పుష్టిగా తాగి తరగతి గదిలోనే పడుకోవడం ఆనవాయితీగా మారింది. విద్యార్థులకు దినదిన గండంలా మారిన ఉపేందర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, విద్యార్థులు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.