HomeTelanganaPolitics

రేవంత్, కేటీఆర్ మధ్యలో బండి…. అట్టర్ ప్లాప్ షో

రేవంత్, కేటీఆర్ మధ్యలో బండి…. అట్టర్ ప్లాప్ షో

జన్వాడ ఫామ్ హౌజ్ పార్టీ సినిమా రసవత్తరంగానే సాగింది కానీ మూడు ముఖ్యమైన అనుమానాస్పద పాత్రల వ్యవహారం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. నిజానికి జన్వాడలో

మాజీ నక్సలైటు సీతక్కపై పోటీకి మరణించిన నక్సలైటు కూతురును దింపిన కేసీఆర్
కేసీఆరె కే మా ఓటు: 10 గ్రామాల ప్రజల ఏకగ్రీవ తీర్మానం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం

జన్వాడ ఫామ్ హౌజ్ పార్టీ సినిమా రసవత్తరంగానే సాగింది కానీ మూడు ముఖ్యమైన అనుమానాస్పద పాత్రల వ్యవహారం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. నిజానికి జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌజ్ లేదా బీఆరెస్ చెప్తున్నట్టు ఇంటిపై పోలీసులు జరిపిన దాడిలో ఏందొరికింది? నిజానికి పోలీసులు, మీడియా చేసిన హడావుడికి తగ్గ విషయం ఉందా ? అంటే అనుమానమే. ఈ దాడి తర్వాత రాజ్ పాకాల పరారయ్యాడు. ఆయన స్నేహితుడు విజయ్ నిషేధిత మాదకద్రవ్యాలు వాడినట్టు పరీక్షల్లో తేలింది. ఇక ఇది రేవ్ పార్టీ అని, ఇందులో విదేశీ మద్యాన్ని వాడారని, అనుమతి లేకుండా పార్టీ చేసుకున్నారని ఎకైజ్ పోలీసులు చేస్తున్న వాదన పెద్దగా వర్కవుట్ అవడం లేదు. ప్రచారం జరిగినంతగా అక్కడేం జరగలేదని అనుమానాలున్నాయి.

అయితే ఈ వ్యవహారంలో కేసీఆర్ తో సహా, బీఆరెస్ నాయకులంతా స్పందించిన తీరుతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. రాజ్ పాకాల ఆయన సోదరుడు శైలేష్ ల ఇళ్ళలో సోదాలు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆరెస్ నాయకులు పోలీసులను అడ్డుకున్నారు. బీఆరెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని రాజ్, శైలేష్ ఇళ్ళలోకి పోలీసులు వెళ్ళకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. అంతే కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో సహా కీలకనేతలంతా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఫామ్ హౌజ్ పై దాడిని, ఇళ్ళలో సోదాలను ఖండించారు. కేటీఆర్ కూడా రేవంత్ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డాడు. చాలా కాలంగా ఎక్కడికీ కదలని నోరు కూడా విప్పని కేసీఆర్ కూడా స్వయంగా ఈ విషయంపై డీజీపీకి ఫోన్ చేసి సోదాలను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే బీఆరెస్ నేతల వ్యవహారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రాజ్ పాకాల కానీ, శైలేష్ కానీ, విజయ్ కానీ బీఆరెస్ నాయకులు కారు, కార్యకర్త‌లు కారు. వీళ్ళ కోసం పార్టీ మొత్తం కదలడంతో దీని వెనక ఏదో కథ ఉందనే డౌట్ రావడం ఖాయం. పరారీలో ఉన్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నిజంగానే ఏమైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా ? అందుకే ఆయనను రక్షించడం కోసమే కేసీఆర్ తో సహా బీఆరెస్ నేతలంతా ప్రయత్నిస్తున్నారా ?

ఇక సందెట్లో సడేమియా అన్నట్టు బీజేపీ నాయకుడు , కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యవహారముంది. ప్రతిపక్షమెప్పుడూ అధికారపక్షంతో పోరాడాలి. కానీ ఈయనెప్పుడు మరో ప్రతిపక్ష‌ పార్టీ బీఆరెస్ పైనే పోరాటం చేస్తూ ఉంటాడు. జున్వాడ ఫామ్ హౌజ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కూడా ఉందని, ఆయనను కొందరు పోలీసు అధికారులు తప్పించారనే ఆరోపణలతో ఆటలో అరటిపండు లాగా ఎంటరయ్యాడు. రేవంత్ కు బీఆరెస్ తో రహస్య ఒప్పందం లేదని నిరూపించుకోవాలంటే కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఆ ఫామ్ హౌజ్ లో ఏం దొరికిందో తెలియదు.అనుమతిలేకుండా పార్టీ చేసుకున్నారని, విదేశీ మద్యం వాడారని మాత్రమే పోలీసులు కేసు పెట్టారు. విజయ్ అనే వ్యక్తి మాత్రమే మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు తేల్చినా అది అక్కడే తీసుకున్నాడా అనేది తేల్చలేదు. మరి అర్జెంట్ గా కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేయడంతో ఆయనపైన కూడా అనుమానాలొస్తున్నాయి.

మొత్తానికి మూడు పక్షాల షో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందనేది నిజం. ఇక్కడ చట్టమూ, నేరమూ పక్కకు పోయి రాజకీయాలదే పైచేయికావడమే విషాధం.