HomeTelanganaPolitics

గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు -BRS ఎమ్మెల్యే సంజయ్

గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు -BRS ఎమ్మెల్యే సంజయ్

తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని,గంగారెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్

పూర్తి సబ్సిడీతో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం
మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?
కేసీఆర్ పై కామారెడ్డిలో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి… ఈ నెల 8వ తేదీన నామినేషన్

తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని,గంగారెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తాను పార్టీ ఫిరాయించినట్టు మాట్లాడుతున్నారని, అయితే ఇప్పటికీ కూడా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేదే తన ఆలోచన అని అన్నారు. నియోజక వర్గంలో రెండు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని ఆ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఆ హత్యను సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయం చేయడం బాధాకరమన్నారు.
గంగారెడ్డి హత్యకేసులో నా హస్తం ఉందని తన అనుచరులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడించడం దురదృష్టకరం అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఫిరాయింపుల రాజకీయాలు మాట్లాడుతున్న జీవన్ రెడ్డిది ఎలాంటి చరిత్రనో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదని,ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రై నాదెండ్ల భాస్కర్ రావు తో కలిసి మళ్లీ పార్టీ ఫిరాయించి, ఆనాడు ఎన్టీఆర్ ను జీవన్ రెడ్డి ఏకాకిని చేసిండని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచే మేం కాంగ్రెస్ వాదులం, మా ఇల్లు, కుటుంబం కాంగ్రెస్ కార్యాలయం కేంద్ర బిందువు అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు.