పవన్ కళ్యాణ్ కు ఆవేశం ఎక్కువని, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని, ఫ్యాన్స్ కేకలు, విజిల్స్ తో ఆయనకు కడుపు నిండిపోతుందని, ఆయనకు రాజకీయాలు పెద్దగా తె
పవన్ కళ్యాణ్ కు ఆవేశం ఎక్కువని, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని, ఫ్యాన్స్ కేకలు, విజిల్స్ తో ఆయనకు కడుపు నిండిపోతుందని, ఆయనకు రాజకీయాలు పెద్దగా తెలియదనే మాట అబద్దమని తేలిపోయింది. అటు బీజేపీ, ఇటు చంద్రబాబు స్నేహంతో పవన్ క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్నాడనేది తేలిపోయింది. ఈ రోజు ఆయన వేసిన కాషాయ వేశం, సనాతన ధర్మ పరిరక్షకుడిలా చేస్తున్న నటన ఆయన చేస్తున్న రాజకీయాలకు పరాకాష్ట. దక్షిణ భారత దేశంలో , ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాల వ్యాప్తికి ఆయన కంకణం కట్టుకోవడం వెనక పెద్ద కథే ఉందంటున్నారు.
తాము ఏపీలో ఎవరి మద్దతు లేకుండా నిలబడటం అసాధ్యమని భావించిన బీజేపీ పెద్దలు బాగా ఆలోచించి పవన్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఆయనకు కాషాయం కట్టి, రోడ్డు మీదికి వదిలింది బీజేపీయే అనే చర్చ సాగుతోంది. దీనివల్ల ఒక్క ఏపీలోనే కాక తెలంగాణలో అటు తమిళనాడులో కూడా పవన్ సనాతన గ్లామర్ తమకు ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. బీజేపీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ ప్రకారం నడుస్తూ, వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ ను వల్లెవేస్తున్న పవన్ కు అప్పనంగా తిరుమల లడ్డూ వ్యవహారం దొరికింది. ఇఅక్ ఆయన, లడ్డూ పేరుతో , మౌనంగా ఉన్నారని హిందువులపై, హిందువులకు మద్దతుగా లేవని కోర్టులపై నోరుపారేసుకున్నాడు. నెయ్యి కల్తీ జరిగిందన్న రుజువులేవంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించినా, ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తున్నా పవన్ మాత్రం మళ్ళీ కల్తీ జరిగిందని చెప్తూ కోర్టునే ధిక్కరిస్తున్నాడు.
తన వెనక బీజేపీ ఉంది కాబట్టి ఎవ్వరూ తననేమీ చేయలేరనే ధైర్యం, చంద్రబాబు కూడా నోరుమూసుకొని ఉండాల్సిందే అన్నంత అలుసు ప్రస్తుతం పవన్ ను నడిపిస్తున్నాయి. నిన్నటి వరకు తనకు చెగువేరా ఆదర్శమని, తాను కమ్యూనిస్టునని చెప్పుకున్న పవన్ ఇంత సడెన్ గా ప్లేటు పిరాయించడం వెనక రాబోయే కాలంలో రాష్ట్రాన్ని పాలించాలన్న కల ఉంది. చంద్రబాబును పక్కకు తోసేయాలన్న కోరిక ఉంది.