HomeTelanganaPolitics

మీ జుగుస్సాకరమైన రాజకీయాల్లోకి సమంత, రకుల్ లను లాగడం సమంజసమా ?

మీ జుగుస్సాకరమైన రాజకీయాల్లోకి సమంత, రకుల్ లను లాగడం సమంజసమా ?

రెండురోజులుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసహ్యకరంగా, జుగుస్సాకరంగా జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో మెజార్టీ ప్రజలు సురేఖ పట్ల సానుభూతి

సురేఖ మాటలకు అంత కోపమొచ్చిన సినీ పెద్దలకు కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎందుకు రాదు ?
‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’
టాలీవుడ్ పెద్దల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం !

రెండురోజులుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసహ్యకరంగా, జుగుస్సాకరంగా జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో మెజార్టీ ప్రజలు సురేఖ పట్ల సానుభూతి ప్రదర్శించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ కార్యక్రమంలో కొండా సురేఖకు మెడలో దండ వేస్తే దాన్ని సోషల్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించి రచ్చ చేశారు. ఈ పని చేసింది బీఆరెస్ సోషల్ మీడియానే అని చాలా మంది నమ్మారు. ఈ విషయాన్ని హరీశ్ రావు ఖండించడమే కాదు సురేఖకు సానుభూతి వ్యక్తం చేశారు.కానీ కేటీఆర్ కనీసం మాట్లాడకపోవడం అందరికీ అనేక అనుమానాలు రేకెత్తాయి.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు కొండా సురేఖ కేటీఆర్ పై విరుచుకపడిన తీరు, ఆయనను విమర్శించే పేరుతో పలువురు హీరోయిన్లను తమ తగువులోకి లాగిన తీరు, ప్రజలకు సురేఖ పై ఉన్న సింపతీ కాస్తా వ్యతిరేకతగా మారింది. కేటీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా ఒకరిని ఒకరు ఎన్ని తిట్లు తిట్టుకున్నా అది రాజకీయనాయకులకు అలవాటే కాబట్టి జనం పట్టించుకోకపోయేవారు. కానీ అసలు వివాదంతో సంబంధం లేదని సమంతను, నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకు వచ్చారు. వారి విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎవరి వైపు నుంచి సమర్థింపు రాలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా దీనిని సమర్దించకపోవచ్చు.

అసలు ఆమె చేసిన ఆరోపణ కూడా ఓ మహిళగా ఎవరూ చేయలేరమో ?. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే.. సమంతను పంపించాలని కేటీఆర్ అడిగారట. వెళ్ళాల్సిందే అని నాగార్జున ఫ్యామిలీ సమంతపై ఒత్తిడి చేసింద‌ట. కానీ సమంతకు ఇష్టం లేక విడాకులు తీసుకుందట. రకుల్ ప్రీత్ విషయంలోనూ అంతే. ఆమె త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ అలవాటు చేశారని కూడా చెప్పారు. కొండా సురేఖ మాట్లాడిన ఈ మాటలు ఆమె అభిమానులు కూడా అసహ్యించుకునేలా ఉన్నాయి.

ఇవి ఎలాంటి పనీ పాట లేకుండా అరుగుల మీద, గోడల మీద‌ కూర్చొని పొరంబోకులు మాట్లాడే మాటలు. వాళ్ళు అన్నారు…వీళ్ళు చెప్పారు…ఎవరో అనుకుంటుండగా విన్నాను… అని చెప్పుకునే మాటలివి. ముఖ్యంగా స్త్రీలంటే చిన్న చూపు ఉండే మహానుభావులు సొల్లుగార్చుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. వీటికి ఎలాంటి ఆధారాలుండవు. ఇలా మాట్లాడేవారు కూడా నిజమా కాదా అని ఆలోచించరు. అలా మాట్లాడుకోవడంలో వాళ్ళకు జుగుస్సాకరమైన మజా వస్తుంది. ఒకరకంగా వీళ్ళు సైకోలు. మరి ఒక స్త్రీ అయి ఉండి, అందులోనూ ఒక బాధ్యతాయుతపదవిలో ఉన్న కొండా సురేఖ ఇలా మాట్లాడం అస్సలు క్షమించాల్సిన విషయం కాదు.