HomeUncategorizedCrime

ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రజారక్షణే మా ధ్యేయం. –రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్,

ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రజారక్షణే మా ధ్యేయం. –రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్,

ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రజారక్షణే మా ధ్యేయం. – శ్రీ యం. శ్రీనివాస్, ఐపియస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని, మంచిర్యాల జోన్ పరిధిలో

కోదాడలో బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు
తుమ్మలతో రేవంత్ భేటీ… త్వరలో కాంగ్రెస్ లోకి తుమ్మల?
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్

ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రజారక్షణే మా ధ్యేయం. – శ్రీ యం. శ్రీనివాస్, ఐపియస్.,

రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని, మంచిర్యాల జోన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలం లో కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని కొన్నిలోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి అయి, ఆస్తి నష్టం మరియు పశువులకు ప్రాణ నష్టం జరుగుచున్నది. మనుషులు వరదలలో చిక్కుకుని ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇట్టి ఇబ్బందులను అధిగమించుటకు గాను, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ యం.శ్రీనివాస్, ఐపియస్., గారి ఆదేశం ప్రకారం, మంచిర్యాల డిసిపి., శ్రీ అశోక్ కుమార్, ఐపియస్., గారు చొరవ తీసుకొని సమస్యను మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ బి. సంతోష్ గారి దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ గారు వ్యక్తిగత శ్రద్ద వహించి, ఫ్లడ్ రెస్క్యూ టీం కు కావలసిన వస్తువులు కొనుగోలు చేయుటకు నిధులు మంజూరు చేయడం జరిగినది. ఇట్టి నిధులతో 1) 10 seater boat with 5HP motor, 2) Lifebuoys -10, 3) Sea master life jackets 50, 4) Medical stretchers -5 మరియు 5) Wood cutter-4 పరికరాలు కొనుగోలు చేసి, ఇట్టి పరికరాలను మంచిర్యాల డిసిపి గారి కార్యాలయంలో, రామగుండం పోలీస్ కమిషనర్ గారు, మంచిర్యాల కలెక్టర్ గారి ఆద్వర్యం లో, మంచిర్యాల డిసిపి గారికి అందజేయడం జరిగినది. ఇట్టి సమావేశం లో శ్రీ యం. శ్రీనివాస్ ఐపీస్., గారు మాట్లాడుతూ ప్రజల ధన, ప్రాణ రక్షణ మా ధ్యేయమని, మంచిర్యాల జిల్లా పరిధిలో, సుశిక్షితులైన 44 సభ్యులతో ఫ్లడ్ రెస్క్యూ టీం తయారు చేయడం జరిగిందని, ఈ టీం యొక్క సభ్యులు ఈ చుట్టుపక్కల ఎక్కడ వరద సమస్యలు వచ్చిన అందుబాటులో ఉండి ప్రజల యొక్క ఆస్తి, ప్రాణ రక్షణలో పాలు పంచుకోగలరని ప్రజలకు విన్నవించడం జరిగినది.