HomeTelanganaUncategorized

ముచ్చట తీరకముందే తెల్లవారిన బతుకులు:ఆరుగురు స్పాట్ డెడ్

ముచ్చట తీరకముందే తెల్లవారిన బతుకులు:ఆరుగురు స్పాట్ డెడ్

ముచ్చట తీరకముందే తెల్లవారిన బతుకులు:ఆరుగురు స్పాట్ డెడ్ •కోదాడ పట్టణ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం..•లారీని ఢీ కొట్టిన ఇన్నోవా వర్టిగా కారు •ప్ర

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం – తొమ్మిది మంది సజీవ దహనం
గౌరీ లంకేష్ ,దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, హత్యల వెనక ఉన్నకుట్ర ను పరిశీలించాలని సీబీఐని ఆదేశించిన‌ సుప్రీంకోర్టు
అక్కడ ద్వేషం గెలిచింది: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసి చంపారు

ముచ్చట తీరకముందే తెల్లవారిన బతుకులు:ఆరుగురు స్పాట్ డెడ్

•కోదాడ పట్టణ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
•లారీని ఢీ కొట్టిన ఇన్నోవా వర్టిగా కారు

•ప్రమాదంలో ఆరుగురు స్పాట్ డెడ్

•మరో నలుగురికి గాయాలు

•హైదరాబాదు నుండి విజయవాడ గుణదల లో పాప కు చెవులు కుట్టించేందు వెళుతుండగా ఘోర ప్రమాదం

•మృతులంతా ఒకే కుటుంబం వారే

కోదాడ,నినాదం:కోదాడ పట్టణ శివార్లలోని శ్రీరంగాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం చిమిరాలకు చెందిన శ్రీకాంత్ గత పది ఏళ్లుగా హైదరాబాదులో కార్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు అతనికి భార్య నాగమణి ఇద్దరు పిల్లలు లాస్య, లావణ్య ఉన్నారు. కాగా లాస్య కు విజయవాడ గుణదల లో చెవులు కుట్టించే వేడుకకు హైదరాబాద్ నుండి శ్రీకాంత్ కుటుంబంతో పాటు బంధువులు మాణిక్యమ్మ ,చందర్రావు కృష్ణంరాజు స్వర్ణ పిల్లలు కౌశిక్, కార్తీక్ బయలుదేరారు. మొత్తం పదిమంది కారులో విజయవాడకు వెళుతుండగా కోదాడ పట్టణ శివారులోని శ్రీరంగాపురం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది ఈ ఘటనలో శ్రీకాంత్ అతని కుమార్తె లాస్య బంధువులు మాణిక్యమ్మ చందర్రావు కృష్ణంరాజు స్వర్ణ అక్కడికక్కడే మృతి చెందారు కాగా మృతుడు శ్రీకాంత్ భార్య నాగమణి అతని కుమార్తె లావణ్య తోపాటు బంధువుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా గాయపడ్డ వారిని మృతులను పోలీసులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు.

మిన్నంటిన రోదనలు…

మృతుడు శ్రీకాంత్ స్వగ్రామం చిమిర్యాల నుండి బంధువులు పెద్ద ఎత్తున కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు బంధువుల రోదనలు వైద్యశాలలో మిన్నంటాయి. వేడుక ముచ్చట తీరకముందే తెల్లవారక ముందే బతుకులు గాలిలో కలిసిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్న తీరు పలువురు నీ కంట తీరు పెట్టింది పోస్టుమార్టంకు ఓ ఆటోలో తెచ్చిన విగత జీవులుగా ఉన్న ఆరు శవాలను చూసి పలువురు ఉద్వేగానికి లోనయ్యారు…