హైదరాబాద్ నగరంలో బీఆరెస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే GHMC మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఇటీవలే బీఆర
హైదరాబాద్ నగరంలో బీఆరెస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే GHMC మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఇటీవలే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బీఆరెస్ కు బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి అది దక్కకపోవడంతో బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్‌తో అంటి ముట్టనట్టుగా ఉన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్ మాజీ మంత్రి మల్లారెడ్డి పోటీతో అందుకు కూడా అవకాశాలు లేవని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
అందువల్ల కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా మల్కాజిగిరి ఎంపీ టికట్ కోసం కాంగ్రెస్ లో కూడా తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో బొంతుకు టికట్ వచ్చే అవ్కాశాలు అంతంత మాత్రమే. అయితే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిక ఆ పార్టీకి బలం చేకూరుస్తుంది.మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వగలుగుతారు.