HomeTelanganaPolitics

కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదు.

కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదు.

జనగాం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్… కెసిఆర్ కి జనగామ అంటేఎంతో గౌరవం ప్రేమ, ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా జ

మహిళల హక్కులంటూ గొంతుచించుకుంటున్న ఫేక్ లీడర్లను నమ్మొద్దు: పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ పరోక్ష వ్యాఖ్యలు
జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ?
BRSలోకి నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి.. కేసీఆర్ తో సమావేశం

జనగాం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్…

కెసిఆర్ కి జనగామ అంటే
ఎంతో గౌరవం ప్రేమ, ఏ అంశం ప్రస్తావనకు వచ్చినా జనగామ, నర్మెట్ట, బచ్చన్నపేట, చేర్యాల గురించే ప్రస్తావిస్తారు.

జనగామ గడ్డ మీద హ్యాట్రిక్ విజయం అందిచిన ప్రతీ కార్యకర్తకు ధన్యధాలు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారు మంచి రోజులు వస్తాయి, బీఆర్ఎస్ కు ఉద్యమాలు, నిర్భంధాలు కొత్త కాదు, అధికారమైనా ప్రతిపక్షమైన మనది ప్రజల పక్షం.

అనేక ఉద్యమలు చేసిన గడ్డ జనగామ.

ఇవ్వాళా కాంగ్రెస్ పార్టీ నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు, వాల్ల మోకానికి నీళ్లన్నా ఇచ్చిండ్రా, కాంతన్ పల్లి కట్టి సంవత్సరం మొత్తం నీళ్లు అందించిన ఘనత మనది.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 420 హామీలు ఇస్తామని చెప్పిండు.

ఇప్పుడు కొండనాలికకు మందేస్తే ఉన్న నాలుక ఉసిపోయినట్టు మాట్లాడుతున్నాడు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల గురించి గ్రామాలలో చర్చ పెట్టాలి.

రైతు బంధు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి ఆపిచ్చిండు, గెలిచిన తరువాత రైతు బంధు ఇవ్వడం లేదు.

కరోనా కష్టకాలం లో కూడా రైతు బంధు టంచన్ గా ఇచ్చినం, ఇప్పుడు అడిగితే రైతుబందు ఆపి ఉద్యోగులకు జీతాలు వేసినాము అంటున్నాడు , అటు జీతాలు రాలే ఇటు రైతు బంధు రాలే.

కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదు.

ప్రగతి భవన్ కట్టిస్తే అందులో బంగారు బాత్రూంలు కట్టించుకున్నారు అని అబ్బద్దపు ప్రచారాలు చేసారు. ఇప్పుడు భట్టి గారు అండ్లనే ఉన్నాడు. ఆయనను అడుగు అందులో ఎన్ని బంగారు బాత్రూంలు ఉన్నాయో.

అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగభృతి హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను 4 మోసాలు చేసింది.

రైతు బంధు, రుణ మాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, వడ్లకు 500 బోనస్ ఇస్తామన్న హామీలు తప్పారు, ఇప్పుడు కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు.

ప్రమాణ స్వీకారం 2 రోజుల ముందే చేస్తివి, హామీలేమో ఇంకా ఇవ్వలేదు.

500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటేనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు.

మహిళలకు మహాలక్ష్మి పథకం అన్నాడు ఇచ్చిండా.

కర్ణాటక లో కూడా 6 గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచుండ్రు, ఇన్ని నెలలు అయితున్న ఇస్తలేరు, అక్కడ ప్రజలు ధర్నాలు చేస్తున్నారు.

రైతు బంధు అడిగితే చెప్పు తో కొడుతా అని కొందరు అంటున్నారు, రేవంత్ రెడ్డి మాటలు రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ కి దమ్ముంటే 40 ఎంపి సీట్లు గెలవండని ఇండియా కూటమి నుండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ సవాల్ విసిరింది.

కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, సచ్చేది లేదు.

కాంగ్రెస్ పార్టీ మెడలు వంచలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపుంచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.

రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం కాదు కదా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం కూడా వచ్చే అవకాశం లేదు.

బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అప్పుడు మీ భరతం పడతాం.

ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే.

కాళేశ్వరం మీద ఎన్నో అసత్యాలు చెప్తున్నారు, ఒక చిన్న సమస్య ఉంటే వెతికి, పరిష్కరించి, నీళ్లు అందించండి, దాన్ని రాజకీయం చెయ్యొద్దు.

సోనియా పుట్టిన రోజున పదవి స్వీకారం చేస్తా అని ముందే చేసాడు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. అనవసరం రాజాకీయాలకు పోవద్దు.

మనమంతా ఒక కుటుంబం లాగా పని చేద్దాం. భవిష్యత్ మనదే.