HomePoliticsNational

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌

జనవరి 16న బీజాపూర్ జిల్లాలోని పమేడ్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ ధర్మారం క్యాంపుపై మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్‌జీఏ దాడిలో 35 మంది భద్రతా సిబ్బంది మరణ

అధికార పార్టీ అండ: యూనివర్సిటీ VC, అధికారులు, పోలీసులను చితకబాదిన ABVP గ్యాంగ్
ఇంత దారుణమా ? హిందూ, ముస్లింలు స్నేహం కూడా చేయొద్దా ?
ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్

జనవరి 16న బీజాపూర్ జిల్లాలోని పమేడ్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ ధర్మారం క్యాంపుపై మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్‌జీఏ దాడిలో 35 మంది భద్రతా సిబ్బంది మరణించారనే సీపీఐ (మావోయిస్ట్) పార్టీ వాదనలను ఛత్తీస్‌గఢ్ పోలీసులు తోసిపుచ్చారు.

పోలీసుల పక్షాన జరిగిన ప్రాణనష్టం గురించి సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ రీజినల్ బ్యూరో (సిఆర్‌బి) ప్రతినిధి ప్రతాప్ చేసిన వాదనలు నిరాధారమైనవిగా పోలీసులు అభివర్ణించారు. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని వారు నొక్కి చెప్పారు.

దాడి జరిగిన వారంలో బస్తర్ ప్రాంతంలో 65 మంది మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు , ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.