HomeTelanganaPolitics

కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌

కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తాడని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్

నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?: బండి సంజయ్
బీజేపీ సీనియర్లు బహిర్గత పరుస్తున్న స్వంత పార్టీ కుట్రాజకీయాలు… గందరగోళంలో ఆ పార్టీ శ్రేణులు
త్వరలో బీఆరెస్ లో చీలిక తప్పదు – పొన్నం ప్రభాకర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తాడని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్ లో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చని సంజయ్ హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని, కుట్రలకు ఆయనే కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. కేసీఆర్ కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు ఆయన హితవు పలికారు.

తెలంగాణలో ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే బీజేపీ ఉద్దేశమని వివరించారు. ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదని బండి సంజయ్ చెప్పారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలను బీజేపీ గెల్చుకోవాలని ఆయన అన్నారు.