పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో గత ఐదేళ్ల నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉన్న జపాన్, సింగపూర్ దేశాలు ఈసారి టాప్ 6లో మాత్రమే నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పె
పాస్‌పోర్ట్ ర్యాంకుల్లో గత ఐదేళ్ల నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉన్న జపాన్, సింగపూర్ దేశాలు ఈసారి టాప్ 6లో మాత్రమే నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు కూడా టాప్ 6లో ఉన్నాయి.యురోపియన్ దేశాలు ర్యాంకుల్లో మెరుగవడమే ఇందుకు కారణం, ఈ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో దృఢమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నాయి. ఈ ఆరు దేశాల పాస్‌పోర్టులు ఉన్నవాళ్లు 194 దేశాలకు వీసా లేకుండానే ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ ర్యాంక్‌లను ప్రకటించారు.
ఫిన్‌ల్యాండ్, స్వీడెన్, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ దేశ పాస్‌పోర్టులు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.
ఇండియా పాస్‌పోర్ట్ తాజా ర్యాంకుల్లో 80వ స్థానంలో ఉంది. ఇండియా పాస్‌పోర్ట్ ఉన్నవారు 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లవచ్చు. పొరుగు దేశం పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 101వ స్థానంలో ఉంది.
భవిష్యత్తులో భారత పాస్‌పోర్ట్ ర్యాంకు పెరుగుతుందని భావిస్తున్నారు. భారతదేశం ఆర్థికంగా బలోపేతమవుతోంది. మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో తన సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది.