అందరూ ఒక పార్టీలో టికట్ రాకపోతే మరో పార్టీలోకి జంపైపోయి మరీ టికట్ తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. టికట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. రాక
అందరూ ఒక పార్టీలో టికట్ రాకపోతే మరో పార్టీలోకి జంపైపోయి మరీ టికట్ తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. టికట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. రాకపోతే అలుగుతారు. కార్యాలయాఅల్లో విధ్వంసం సృష్టిస్తారు. గొడవలకు దిగుతారు. అయితే ఓ అభ్యర్థి మాత్రం టికట్ ప్రకటించాక, నామినేషన్లకు రేపే చివరి తేదీకాగా తాను పోటీ చేయటం లేదని చేతులెత్తేశాడు.
భారతీయ జనతా పార్టీ వనపర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు తన అభ్యర్థిగా ఆర్టీసీ కార్మిక నాయకుడు అశ్వత్థామరెడ్డి పేరును ప్రకటించింది. ఆయన అనుచరులతో కలిసి ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఈ రోజు నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.
ఈ రోజు తమ నాయకుడు నామినేషన్ వేస్తాడని ఆయన అనుచరులు, బీజేపీ కార్యకర్తలంతా రెడీ అయ్యారు. అయితే ఎందుకోగానీ ఆయన మనసు మార్చుకున్నాడు. పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. చావు కబురును చల్లగా ఈ రోజు తన కార్యకర్తల వద్ద, అధిహిష్టానం వద్ద వెల్లడించాడు. ఆయనను కన్విన్స్ చేయడానికి అధిష్టానం ప్రయత్నించినప్పటికీ ఆయన వినకపోవడంతో ఏం చేయాలో అర్దం కాక బీజేపీ పెద్దలు తలలు పట్టుకున్నారట. నామినేషన్ వేయడానికి రేపే చివరి గడవు కావడంతో మరో అభ్యర్థి కోసం వెతకడం మొదలుపెట్టారట.
బీజేపీ పార్టీలో కీలక భూమిక పోషించిన పలువురు పార్టీ నుంచి బైటికి వెళ్ళిపోవడం, మరికొందరు ముఖ్యనాయకులు ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకోవడం, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దిగజారిపోవడం…ఇవన్నీ ఆలోచించే అశ్వత్థామరెడ్డి వెనక్కి తగ్గి అధిష్టానాన్ని ఫూల్ చేసినట్టు సమాచారం.