HomeTelangana

ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం

ABP-C ఓటర్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం

నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ABP-C-ఓటర్ తాజా సర్వే అంచనా వేసింది. ఈ మేరకు ఈ రోజు సర్వే వివ

300 మంది యువకులకు భజరంగ్ దళ్ సాయుధ శిక్షణ
బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
బుల్డోజర్ రాజ్యంలో ఈ వృద్దులు, మహిళలు చేసిన పాపమేంటి ? తప్పు ఒకరు చేస్తే మరొకరిని రోడ్డుపాలు చేస్తారా ?

నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ABP-C-ఓటర్ తాజా సర్వే అంచనా వేసింది. ఈ మేరకు ఈ రోజు సర్వే వివరాలను ప్రకటించింది. కాంగ్రెస్ Congress కు 48-60 సీట్లు వస్తాయని, BRS 43-55 సీట్లు సాధిస్తుందని , 5-11 సీట్లతో బీజేపీ BJP చివరి స్థానంలో ఉంటుందని సర్వే తేల్చి చెప్పింది.

పీఎం నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రచారాలు చేసిన‌ప్పటికీ, తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం లేదా సీట్లలో పెద్దగా లాభం పొందకపోవచ్చునని అభిప్రాయ సేకరణలో తేలింది. గత వారంలో లోక్ పోల్ చేసిన మరో ప్రధాన సర్వే కూడా BRS కంటే ఒక మోస్తరు ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం గమనార్హం.

కాంగ్రెస్ 10.5% పెరుగుదలలో దాదాపు 39% ఓట్ల వాటాను పొందుతుంది. 9.4% ఓట్ల వాటా క్షీణతతో పాలక BRS 37% తో ఆ తర్వాతి స్థానాల్లో ఉంది.